priyanka
ఎంటర్‌టైన్మెంట్

Actress: ఆస్తులు అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!

Actress: బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ప్రియాంక చోప్రా ఒకరు. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న 5వ మహిళ ఈమె కావడం విశేషం. అంతకుముందు భారత ప్రపంచ సుందరిగా కూడా ఎన్నికయ్యారు. ఇక తమిళ సినిమాతో సినీ కెరీర్ మొదలుపెట్టింది. విజయ్ హీరోగా నటించిన ‘తమిళన్’ అనే చిత్రం ద్వారా ప్రియాంక చోప్రా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై’ అనే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేపోయింది. తర్వాత అక్షయ్ కుమార్ జంటగా నటించిన ‘అందాజ్’ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో నటనకు గానూ ‘ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం’ కూడా ప్రియాంక అందుకుంది. ప్లాన్, కిస్మత్, అసంభవ్, బ్లాక్‌మెయిల్, బ్లఫ్‌మాస్టర్, ఓం శాంతి ఓం, ద్రోణ, కమీనీ, బర్ఫీ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజా ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఆస్తులు అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముంబై అంథేరిలో ప్రియాంకకు అత్యంత ఖరీదైన ప్లాట్స్ ఉన్నాయట. ప్రస్తుతం ఆ ఫ్లాట్‌లకు బాగా డిమాండ్‌ ఉంది. విలాసవంతమైన నాలుగు ఫ్లాట్‌లు ఉండగా.. వాటిని రూ.16.17 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్‌ ఉండగా.. రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు విక్రయించారట. ఇక 19వ అంతస్తులో ఉన్న విలాసవంతమైన ప్లాట్ నిరూ.6.35కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇటీవలే వీటికి సంబంధించిన డబ్బులు ప్రియాంకకు తాజాగా ముట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు 2021లో వెర్సోవాలోని 2 ఆస్తులను, 2023లో లోఖండ్‌వాలాలోని 2 పెంట్‌ హౌస్‌ ప్లాట్స్ కూడా బ్యూటీ ఇప్పటికే అమ్మేసిందట. ప్రస్తుతం గోవా, న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్‌లో కాస్ట్‌లీ భవనాలు ఉన్నాయట. అయితే ప్రియాంక ఆస్తులు అమ్మడం వల్ల నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

ఇక అమెరికాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నికోలస్ జెర్రీ జోనాస్‌ని ప్రియాంక వివాహమాడింది.  కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. దీంతో అప్పటి నుంచి భర్త నిక్‌ జోనస్‌, కుమార్తె మేరీ చోప్రా జోన్స్‌ తో కలిసి లాస్‌ ఏంజెలెస్‌లో ఉంటుంది. ఇక హాలీవుడ్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టింది. హిందీ మూవీస్‌లో నటించడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో ముంబైలో ఉన్న ఆస్తులని ప్రియాంక ఒక్కొక్కటిగా అమ్మేస్తోందని బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

priyanka chopra

Also Read: అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే వ‌చ్చేవి: స్టార్ హీరోయిన్ 

ఇక టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు- డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29లో హీరోయిన్ గా ప్రియాంక నటిస్తోంది. ఇందులో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో వరల్డ్ వైడ్ గా భారీ హిట్ ని సొంతం చేసుకున్న రాజమౌళి ఈ మూవీని హాలీవుడ్‌కి పరిచయం చేసేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాని దాదాపుగా రూ.1200 కోట్లు బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?