Star Heroine: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల జీవితంలో ఓ పార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఛానెల్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రోజు మొత్తంలో ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు? వంటి విషయాలు పంచుకుంటూ ఉంటున్నారు. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.
ఇక సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అప్పుడపుడు కొందరు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. సందడి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని విచిత్రమైన ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌కి అభిమాని నుంచి పెద్దే ప్రశ్న ఎదురైంది. ఆమె ఇచ్చిన రిప్లైకి ఆ అభిమాని మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంతకీ ఆ ఆ హీరయిన్ ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan).
2013లో ‘బట్టం బోలే’ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిర్ణయకం, నాను మట్టు వరలక్ష్మి, బియాండ్ ది క్లౌడ్స్, ది గ్రేట్ ఫాదర్ కార్తీక్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా అనే మూవీతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ఈ భామకు ఎంతగానో పేరు తెచ్చింది. ఆమె అందం, నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ అందాల తార.
తమిళంతో పాటు మలయాళంలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ యాక్టర్స్‌తో తమిళంలో నటించింది. కోలీవుడ్‌లో బిజీగా ఉంటూనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న రాజాసాబ్ అనే మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ బ్యూటీని తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.
Also Read: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!
ఇదిలాఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో మాళవికకు ఓ అభిమాని నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ‘మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు మంచి హస్బెండ్‌గా ఉండాలంటే ఎలా ఉండాలి.’ అని అభిమాని.. మాళవికని అడిగాడు. అప్పుడు షాకింగ్ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటీ. తనకు పెళ్లి అంటేనే ఇష్టం లేదని సమాధానం చెప్పింది. తాను ఎలాంటి భర్తను కోరుకోవడం లేదని వెల్లడించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం మాళవిక తెలుగులో ‘రాజా సాబ్’.. కోలివుడ్‌లో ‘సర్ధార్-2’.. మలయాళంలో ‘హృదయపూర్వం’ అనే చిత్రాల్లో నటిస్తుంది. ఈ బ్యూటీ తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకుని.. తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోవాలని కోరుకుందాం.