Deeksha Seth
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: మూవీ ఛాన్స్‌లు లేక ఐటీ జాబ్ చేస్తున్న స్టార్ హీరోయిన్?

Tollywood: ఏ పరిశ్రమలోనైనా సక్సెస్ అనేది చాలా ముఖ్యమైంది. విజయం లేకుంటే మనం ముందుకు సాగలేము. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ లేకుంటే రాణించడం కష్టమే. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. 1,2 సినిమాలతోనే దూరమైన వారెందరో ఉన్నారు. సక్సెస్ అందుకోలేకే ఆఫర్లు రాక చాలా మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. ఈ జాబితో హీరోయిన్ దీక్షాసేత్(Deeksha Seth) కూడా ఒకరు. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమా హిట్స్ లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ లేడి.

2010లో ‘వేదం చిత్రంతో టాలీవుడ్‌కి దీక్షాసేత్‌ పరిచయమైంది. ఈ మూవీలో అల్లు అర్జున్ జంటగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ మూవీతోనే ఎంతో మంది యువతను తన వైపు తిప్పుకుంది ఈ అందాల తార. ఆ తర్వాత మాస్‌ మహారాజ రవితేజ హీరోగా యాక్ట్ చేసిన ‘మిరపకాయ్‌’ సినిమాలో దీక్షాసేత్ నటించింది. వాంటెడ్, నిప్పు ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాలే సాధించాయి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కథానాయికగా మారింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’, ‘రెబెల్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా రెండు సినిమాలు కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఆ తర్వాత ఈ బ్యూటీకి ఛాన్సెస్ రాకుండా పోయాయి.

Deeksha Seth

Also Read: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!

ఇక తెలుగులో ఆఫర్స్ రాకపావడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ అనే రెండు హిందీ మూవీస్‌లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా ఆశించిన విజయాలు అందుకోలేపోయాయి. రెండు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అటు కన్నడంలో హీరో దర్శన్ జంటగా జగ్గూబాయ్ అనే చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత సినిమా ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు దీక్షా సేత్‌ ఏం చేస్తోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అందాల తార. తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే దీక్షా సేత్ ప్రస్తుతం లండన్‌లో ఉంటుంది. అక్కడే జాబ్ చేసుకుంటూ జీవితం గడుపుతుందని తెలుస్తుంది. ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నట్టు సమాచారం.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్