Stalin Re Release
ఎంటర్‌టైన్మెంట్

Stalin Re Release: బర్త్‌డేకి ‘స్టాలిన్’ రీ రిలీజ్.. మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..

Stalin Re Release: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్ డే వచ్చేస్తుంది. ఆయన బర్త్‌డే అంటే ఫ్యాన్స్ అందరికీ పండగ రోజే. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిందేమో కానీ, ఒకప్పుడు అయితే చిరంజీవి బర్త్‌డే అంటే, ఊర్లలో ఉండే సందడే వేరు. అయితేనేం, ఇప్పుడు కూడా అప్పటి రోజులను గుర్తుకు తెచ్చేలా.. ఓ ట్రెండ్ సెట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి సినిమాలను రీ రిలీజ్ పేరుతో విడుదల చేసి, ఫ్యాన్స్‌లో ఆనందం నింపుతున్నారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి చిత్రాలు ఇటీవల రీ రిలీజై.. మంచి ఆదరణను రాబట్టుకున్నాయి. ఇక ఈ బర్త్‌డే‌కి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యద్భుతమైన చిత్రంగా నిలిచిన ‘స్టాలిన్’ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో (Stalin 4K) రీ రిలీజ్ చేసేందుకు.. ఆ చిత్ర నిర్మాత, చిరంజీవి తమ్ముడు నాగబాబు (Nagababu) అన్నీ సిద్ధం చేశారు. ఆ విషయాన్ని తెలుపుతూ.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో..

Also Read- Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం

‘‘నమస్కారం. స్టాలిన్ చిత్రం రిలీజై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నా పుట్టినరోజున, అంటే ఈ ఆగస్ట్ 22న మీ ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాత, నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇదొక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవాన్‌గా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రువులతో పోరాడటం కాదు, దేశం లోపల ఉన్న శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని, ఈ సమాజంలో అంతర్యుద్ధం చేయడానికి తలపెట్టినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్. ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్లు, కృతజ్ఞత చెప్పడం కాకుండా.. అలాంటి మంచి పనే మరో ముగ్గురుకి చేసి, ఆ ముగ్గురుని మరో ముగ్గురుకి చేసుకుంటూ వెళ్లాలని.. ఒక చక్కటి సందేశాన్ని, మంచిని ప్రభోదించే ప్రయోగం ఇందులో చాలా గొప్పగా చెప్పబడింది. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పిన చిత్రం ఈ స్టాలిన్. అలాగే ఈ చిత్రంలో నటించిన ఖుష్బూ, త్రిష ఇతర సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా స్వరబ్రహ్మ మణిశర్మకు, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌కు, కెమెరా చోటా కె నాయుడుకు, నా తమ్ముడు నాగబాబుకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ చిత్రం మీ అందరికీ ఓ మంచి అనుభూతిని ఇస్తుందనే దానిలో ఎలాంటి సందేహం లేదని, ముఖ్యంగా నమ్ముతూ ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జైహింద్’’ అని మెగాస్టార్ చిరంజీవి ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

Also Read- Priyanka Mohan: ‘OG’లో ప్రియాంక మోహన్ పాత్ర పేరు ఇదే.. ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ స్టాలిన్ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అవుతున్నా.. ఇందులోని ఓ పాట మాత్రం నిత్యం ఈ చిత్రాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎవరు చనిపోయినా కూడా ఇందులోని ‘సూర్యుడే సెలవని’ అనే పాటను ప్లే చేస్తూనే ఉంటారు. అలా ఈ సినిమా అందరి మనస్సుల్లో చోటును దక్కించుకుంది. మరి ఈ రీ రిలీజ్‌లో ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో చూద్దాం..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!