Priyanka Mohan in OG
ఎంటర్‌టైన్మెంట్

Priyanka Mohan: ‘OG’లో ప్రియాంక మోహన్ పాత్ర పేరు ఇదే.. ఫస్ట్ లుక్ విడుదల

Priyanka Mohan: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితం పవర్ స్టార్ ‘ఓజీ’నే. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ‌నుంచి వచ్చిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిజల్ట్ తేడా కొట్టినా, ‘ఓజీ’పై మాత్రం అది ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు అని చెప్పడానికి.. రీసెంట్‌గా వచ్చిన ఫైర్ స్ట్రోమ్ సాంగే సాక్ష్యం. ఈ సాంగ్ ఇప్పటికీ మ్యూజిక్ క్లబ్స్‌లో టాప్ ప్లేస్‌లోనే ఉండటం చూస్తుంటే.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర (OG)గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇప్పటి వరకు ఆమె లుక్‌ని రివీల్ చేయలేదు. శనివారం (ఆగస్ట్ 16) ఆమె బర్త్‌డే‌ని (HBD Priyanka Arul Mohan) పురస్కరించుకుని, ‘ఓజీ’ నుంచి ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు.

Also Read- Jagapati Babu: చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు.. అఖిల్ పెళ్లిలో అసలు తాగానా? నాగ్‌ని ప్రశ్నించిన జగ్గూ భాయ్

ఈ ‘గ్యాంగ్ స్టర్’ సినిమాలో హీరోయిన్ పాత్ర, లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆ ఆసక్తికి తెరదించుతూ.. ‘ఓజీ’లో ప్రియాంక చేస్తున్న పాత్ర పేరు, ఆమె లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. నిజంగా ఆమె లుక్ చూసిన తర్వాత ఈ సినిమాను ఇప్పటి వరకు చూసిన కోణమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే ఫీల్‌ని కలిగిస్తే.. తాజాగా విడుదలైన ప్రియాంక అరుళ్ మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆమె ఫస్ట్ లుక్‌కు సంబంధించి మేకర్స్ రెండు పోస్టర్స్ వదిలారు. ఇందులో ఆమె కణ్మణి (Kanmani) పాత్రలో కనిపించనున్నారు. ఇక పోస్టర్స్‌ని గమనిస్తే.. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తే.. మరో పోస్టర్ ప్రశాంతత, గృహ వాతావరణాన్ని తలపిస్తోంది. అందుకే అంది.. ఆమె లుక్ చాలా భిన్నంగా ఉంది అని అన్నది.

Also Read- Viral Video: పూరి ఆలయంలో అద్భుతం.. జెండా పట్టుకున్న హనుమాన్.. వీడియో వైరల్!

ఈ లుక్‌తో అందరినీ కన్ఫ్యూజ్ చేసేశాడు దర్శకుడు సుజీత్. అసలు ఏం చూపిస్తున్నావయ్యా? అంటూ ఫ్యాన్స్ అందరూ మరోసారి సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎందుకంటే, వారి ఊహించిన దానికి భిన్నంగా ఆమె లుక్ ఉంది. మొత్తానికి సుజీత్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడనేలా అయితే టాక్ మొదలైంది. సుజీత్ విస్ఫోటన కథనానికి పవన్ కళ్యాణ్ నిప్పు అయితే.. ప్రియాంక అరుళ్ మోహన్ నీరు అనేలా అప్పుడే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అంత కూల్‌గా ఆమె లుక్ ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఒక పెను తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాతలు ఈ లుక్‌తో అభివర్ణించినట్లయింది. ఇప్పటికే వచ్చిన ఫైర్ స్ట్రోమ్ రికార్డులను బద్దలు కొడుతుండగా.. ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. త్వరలో ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?