SS Rajamouli: రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అవడంతో పాటు, టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Also Read- Kannappa: ఇప్పటి వరకు ‘కన్నప్ప’ కలెక్ట్ చేసింది అంతేనా? భారీ లాస్ తప్పదా?
ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. సాయి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని మాత్రమే అనుకున్నాను. కానీ శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్.. ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు, టెక్నీషియన్స్ ఉంటారో.. అలా యాడ్ చేసుకుంటూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఫైనల్‌గా చాలా పెద్ద సినిమా చేశారు. సినిమా 1000 ప్లస్ స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్‌కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. సినిమాని ఈ లెవల్‌కి తీసుకొచ్చిన సాయి కొర్రపాటిని అభినందిస్తున్నాను. జెనీలియా అప్పుడు ఎలా వుందో ఇప్పుడూ కూడా అలాగే ఉంది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూపిస్తారనే నమ్మకం ఉంది. దేవి ఎప్పుడూ కూడా తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. ‘వైరల్ వయ్యారి’ ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read- Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ
ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయించిన సాంగ్ అది. ఇక సెంథిల్ గురించి చెప్పాలంటే.. నా సొంత ఇంట్లో మనిషి గురించి చెప్పినట్టే ఉంటుంది. తను అద్భుతమైన టెక్నీషియన్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్‌ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. ఈ సినిమాకి తను బిగ్ ఎసెట్. పీటర్ క్రేజీ మ్యాన్. ఇంకా ఏదో బెటర్‌గా చేయాలనే తపన తనలో ఉంటుంది. ఎప్పుడూ విపరీతంగా కష్టపడుతుంటాడు. పీటర్, సెంథిల్ ఇద్దరూ కలిసి ఒక అబ్బాయి బాగా చేస్తున్నాడని చెబుతున్నారంటే.. కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. వాళ్ళిద్దరూ పొగుడుతున్నారంటే ఇది నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్స్. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి తీసుకెళుతుంది. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. తను ఇంకా ఇంకా పెద్ద స్థాయికి వెళుతుంది. రాధాకృష్ణ మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నారు. ఫైనల్‌గా ఇంత అద్భుతమైన ప్రాజెక్టుని బయటకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చి, డైరెక్టర్‌గా తనకు మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. జూలై 18న సినిమా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి. పైసా వసూల్ మూవీ ఇదని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు