Sree Vishnu Launches Lopaliki Ra Cheptha Song
ఎంటర్‌టైన్మెంట్

Sree Vishnu: ‘లోపలికి రా చెప్తా’ అంటున్న శ్రీ విష్ణు.. విషయం ఏంటంటే?

Sree Vishnu: ‘లోపలికి రా చెప్తా’ (Lopalliki Ra Cheptha) అంటున్నారు హీరో శ్రీ విష్ణు. ఎవరిని? ఎందుకు? అని ఏదేదో ఊహించేసుకుంటారేమో.. అలా ఏం లేదిక్కడ. మ్యాటర్ ఏంటంటే.. ‘లోపలికి రా చెప్తా’ అనేది సినిమా టైటిల్. ఆయన నటిస్తున్న సినిమా టైటిల్ ఇదనుకుని.. ఇదేంటి? ఇలాంటి టైటిల్‌తో శ్రీ విష్ణు సినిమా చేస్తున్నాడేంటి? అని మళ్లీ ఊహించేసుకుంటారేమో? అది కూడా కాదు.. ఇక్కడ మ్యాటర్ ఏమిటంటే.. ‘లోపలికి రా చెప్తా’ టైటిల్‌తో టాలీవుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు హీరో శ్రీ విష్ణు సపోర్ట్ చేశారు. అది విషయం. ఈ సినిమా యూనిట్‌లో తనకు తెలిసిన మిత్రులు ఉండటంతో.. సినిమాలోని పాటను విడుదల చేసి, సినిమా కూడా ఫస్ట్ డే నే చూస్తానని టీమ్‌కు మాటిచ్చారు.

Also Read- Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్‌ ప్రకటన?

సరికొత్త హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లోపలికి రా చెప్తా’. ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర (Konda Venkata Rajendra) స్వీయదర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో వెంకట రాజేంద్రతో పాటు మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ పాట ‘టిక్ టాక్ చేద్దామా..’ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ‘టిక్ టాక్ చేద్దామా..’ పాట ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Also Read- Ram Charan: రామ్ చరణ్ వాళ్ళకి అంత బాధను మిగిల్చాడా.. గేమ్ ఛేంజర్ నిర్మాత సంచలన కామెంట్స్

వాస్తవానికి టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని, సినిమాపై క్రేజ్ పెంచేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాంద్ కంపోజ్ చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. రీసెంట్‌గా స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేసిన ‘లోపలికి రా చెప్తా’ థియేట్రికల్ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆసక్తిని కలిగించింది. హారర్ కామెడీ జానర్‌లో ఈ సినిమా సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని, ప్రేక్షకుల అంచనాలను అందుకుని పెద్ద విజయం సాధిస్తుందని యూనిట్ కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి, ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా శ్రీ విష్ణు కూడా కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?