Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?
Spirit Movie (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Spirit: టాలీవుడ్ బాహుబలి, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ న్యూ ఇయర్ మామూలుగా ఉండదనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభాస్ (Prabhas), మరోవైపు తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) కు సంబంధించి ఒక భారీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘యానిమల్’ (Animal) చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. జనవరి 1న న్యూ ఇయర్ స్పెషల్‌గా ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందనే విషయం తెలిసిందే. ప్రభాస్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో సందీప్ వంగా మార్క్ యాక్షన్ అండ్ ఇంటెన్సిటీతో ప్రభాస్‌ని చూడాలని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Also Read- ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!

రిలీజ్ ఎప్పుడంటే?

‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘యానిమల్’ చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తుండటంతో, ఆర్ఆర్ (RR) మళ్ళీ వేరే లెవల్‌లో ఉండబోతుందని స్పష్టమవుతోంది. హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సందీప్ వంగా తన మునుపటి చిత్రాల కంటే ఈ సినిమాను మరింత రా అండ్ రస్టిక్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read- Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!

‘ది రాజా సాబ్’ ప్రచారంలో బిజీ బిజీ

మరోవైపు ప్రభాస్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ‘స్పిరిట్’ పనులను కూడా చక్కబెడుతున్నారు. ఒకేసారి రెండు భారీ సినిమాల అప్‌డేట్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతి ముందే వచ్చేసినట్లయింది. మరో వైపు ‘ఫౌజీ’ నుంచి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ న్యూ ఇయర్ రోజున ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ వస్తే మాత్రం సోషల్ మీడియాలో రికార్డులన్నీ చెల్లాచెదురు అవ్వడం ఖాయం. సందీప్ వంగా – ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ న్యూ ఇయర్ ట్రీట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాకపోతే, ఇప్పటి వరకు మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు