soonu-sood (image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సాయం

Sonu Sood: టాలీవుడ్ హాస్యనటుడు ఫిష్ వెంకట్ తీవ్రమైన మూత్రపిండ సమస్యతో పోరాడుతూ ఇటీవల కన్నుమూశారు. చికిత్స కోసం ఆయన కుటుంబం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, సరైన చికిత్స అందక ఆరోగ్యం క్షీణించి మరణించారు. గబ్బర్ సింగ్ టీమ్‌తో సహా కొందరు మినహా, టాలీవుడ్ పరిశ్రమ ఈ క్లిష్ట సమయంలో ఎవరూ స్పందించలేదని ఆయన కుటుంబం నిరాశ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నటుడు సోను సూద్ మానవతా దృక్పదంతో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఫిష్ వెంకట్ కుటుంబానికి రూ.1.5 లక్షల రూపాయలు విరాళం అందించారు. భవిష్యత్తులో ఏ సహాయం కావాల్సి వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఫిష్ వెంకట్ చివరిగా ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ చిత్రంలో నటించారు. సోను సూద్ కు ముందే, నటుడు విశ్వక్ సేన్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కిడ్నీ మార్పిడి కోసం రూ.50 లక్షల రూపాయలు అవసరమని కుటుంబం కోరగా, దురదృష్టవశాత్తు ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు.

Read also- Anganwadi centers: విధులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: మంత్రి సీతక్క

సోను సూద్ ముఖ్యంగా కరోనా సమయంలో చాలా మంది ప్రజలకు సాయం చేసి మంచి పేరు పొందారు. ఆయన ప్రధానంగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో పనిచేస్తారు. 1973 జులై 30న పంజాబ్‌లోని మోగాలో జన్మించిన సోను సూద్, యశ్వంతరావ్ చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీ.టెక్ పూర్తి చేశారు. 1999లో తమిళ చిత్రం ‘కల్లజగర్తో’ సినీ రంగంలో అడుగుపెట్టారు. అరుంధతి (2009), దబంగ్ (2010), జులాయి (2012) వంటి చిత్రాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందారు, అనేక అవార్డులు అందుకున్నారు. యాక్టర్ గానూ, అవసరాల్లో ఉన్న వారికి సాయం చేసే మంచి వ్యక్తి గానూ ఆయనకు మంచి పేరు ఉంది.

Read also- Dude Movie: ‘డ్యూడ్’ సినిమా నుంచి ప్రదీప్ రంగనాథన్ పోస్టర్ రిలీజ్

ఫిష్ వెంకట్ 200కు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు, ప్రధానంగా విలన్ దగ్గర హాస్య ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేవారు. ‘ఖలేజా’, ’ఏక్ నిరంజన్’, ‘రెడీ’ ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన సహజమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మూత్రపిండాలు పాడవడం వల్ల ఆయన మరణించారు. ఆయన కుటుంబానికి సోను సూద్, విశ్వక్ సేన్, పవన్ కళ్యాణ్ వంటి వారి సహాయం కొంత ఊరటనిచ్చింది. టాలీవుడ్ లో వందల సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లకు ఈ వారంలోనే రూ.188 కోట్లు రిలీజ్!

Foreign Cars Smuggling Case: లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. తెరపైకి కేటీఆర్ పేరు.. లిస్టులో అందరూ ప్రముఖులే!

Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!