Sonakshi and Zaheer
ఎంటర్‌టైన్మెంట్

Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ వార్తలపై.. భలే స్పందించింది

Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఈ మధ్యకాలంలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ కొందరు కావాలనే వార్తలను వైరల్ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటే, మరి ఎవరు క్రియేట్ చేస్తున్నారో కానీ, ‘ఆమె ప్రజంట్ ప్రెగ్నెంట్.. ఇకపై సినిమాలు చేయదు’ అంటూ వార్తలు సృష్టిస్తున్నారు. ఇలాంటి మాఫియా బాలీవుడ్‌లో బాగా ఉందని ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్న వార్తలను చూస్తుంటే తెలుస్తుంది. ఇలాంటి వార్తలను ఎవరో కాదు.. కొందరు సెలబ్రిటీలు కావాలని మీడియాతో చేయిస్తుంటారనే టాక్ ఉంది. మరి అందులో నిజం ఏంటనేది మాత్రం ఆ వండుతున్న వారికే తెలియాలి.

Also Read- Ileana: రెండో బిడ్డకు జన్మినిచ్చిన ఇలియానా.. సెలబ్రిటీలు ఆపుకోలేకపోతున్నారు

సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), నటుడు జహీర్ ఇక్బాల్‌ (Zaheer Iqbal)ను వివాహం చేసుకుని వన్ ఇయర్ అవుతుంది. 23 జూన్, 2024న వారి మ్యారేజ్ అయింది. వీరిద్దరూ 2022లో వచ్చిన ‘డబుల్ ఎక్స్ఎల్’ అనే చిత్రంలో కలిసి నటించారు. దాదాపు ఏడేళ్ల డేటింగ్ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి, వారి ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే వీరి వివాహం అయిందో.. అప్పటి నుంచి సోనాక్షి, జహీర్ వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. పెళ్లికాక ముందు వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, డేటింగ్ విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని, పెళ్లి తర్వాత ‘సోనాక్షి కుటుంబం జహీర్‌ని యాక్సెప్ట్ చేసిందా? లేదా?’ అని ఇలా ఎప్పుడూ ఏదో ఒక వార్త వారిపై వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా? అంటూ వార్తలు పుట్టిస్తున్నారు. తమపై ఎన్ని వార్తలు, ఏ విధంగా వచ్చినా, సోనాక్షి సిన్హా మాత్రం ఎప్పుడూ రియాక్ట్ కాలేదు.

Also Read- Manchu Manoj: మనోజ్ సార్.. మీరు మారిపోయారు! లేకపోతే ఇదేంటి?

ఫస్ట్ టైమ్ ఈ వార్తలు పుట్టిస్తున్న వారందరికీ ఆమె ఇచ్చి పడేశారు. ‘‘ఇలాంటి వార్తలతో కూడా ఒక రకపు ఎమోషనల్ ఇమ్యూనిటీ వస్తుంది. మనం ఏం చేసినా, ప్రజలు ఏం చెప్పాలనుకుంటే అదే చెబుతారు. అదే జనాల్లోకి వెళుతుంది. నేను తెల్లటి దుస్తులు ధరించానని చెబితే, కాదు నలుపు వస్త్రాలు ధరించారని ఎవరో ఒకరు అంటారు. దానిపై ఏదైనా రియాక్ట్ అయితే.. సాగదీయడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కాబట్టి, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవకుండా, మీ జీవితంలో మీరు మీకు నచ్చినట్లుగా ముందుకు సాగండి’’ అని సోనాక్షి చెప్పుకొచ్చారు. ఇంకా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో భావోద్వేగానికి లోనై, ఆనందంతో గంతులేసిన వీడియో గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘‘అప్పుడు నేను అంత సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. వధువు ఎప్పుడూ సిగ్గుపడుతూ, తలదించుకుని ఉండాలని నాకు తెలుసు. కానీ ఆ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో ఆ రోజు అత్యంత సంతోషకరమైన రోజు. నేను సెలక్ట్ చేసుకున్న నా భాగస్వామి, నా జీవితంలోకి అధికారికంగా ఎంటరైన రోజు. అందుకే అంత ఆనందంగా ఉన్నాను’’ అని సోనాక్షి తెలిపింది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?