SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం..
skn-comments
ఎంటర్‌టైన్‌మెంట్

SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం.. ‘ది రాజాసాబ్’ థియేటర్లు ఇవ్వండి..

SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఓ విన్నపం అంటూ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు ఎస్కేఎన్ ఎందుకు అలా అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది. అన్న విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన అన్న దానిని బట్టి చూసుకుంటే టాలీవుడ్ థియేటర్ల విషయంలో నిర్మాతల మధ్య కోల్డ్ వార్లే జరుగుతున్నట్లు ఉంది. ఎందుకు అంటే ఇంతకు ముందు ఏడాది ఇదే సంక్రాంతి సీజన్ సమయంలో దిల్ రాజుకు కొంత మంది పప్పటి నిర్మాతలకు గొడవలు జరిగాయిని తెలుస్తోంది. అదే సమయంలో దిల్ రాజు థియేటర్ల విషయమై క్లారిటీ కూడా ఇచ్చారు. అప్పుడు దీల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విజయ్ సినిమా ‘వారీసు’కు తెలుగులో అత్యధిక ధియేటర్లు ఇచ్చారు. దీనిపై అప్పుడు పెద్ద వివాదమే అయింది. ప్రస్తుతం ఎన్కేఎన్ అన్న మాటలు చూస్తుంటే ఈ సారి కూడా దళపతి విజయ్ హీరోగా వస్తున్న‘జన నాయగన్’ కు కూడా అలా జరుగుతుందని అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. కాగా జన నాయగన్ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. దీంతో అసలు థియేటర్లు అన్నీ తెలుగు సినిమాలకు ఇవ్వవచ్చు.. అంతే కాకుండా.. ప్రతి సినిమాకు కనీస కలెక్షన్లు రాబట్టవచ్చు.

Read also-Yash Introduced as Raya: ‘టాక్సిక్’ నుంచి యష్ ఇంట్రడ్యూసింగ్ షాట్ చూశారా.. బాబోయ్ ఇది అరాచకమే..

అసలు ఎస్కేఎన్ ఏం అన్నారంటే?

ఎప్పుడూ తన దైన శైలిలో మాట్లాడుతూ.. వార్తల్లో నిలిచే నిర్మాత ఎస్కేఎన్. తాజాగా ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ప్రేస్ మీట్ కు ఆయన హాజరయ్యారు. సినిమా గురించి మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతోమంది కొత్త వారికి అవకాశం కల్పించింది. దాదాపు ఇప్పటివరకూ 50 చిత్రాలకు చేరువవుతోంది. ఈ సంస్థలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. ‘ది రాజాసాబ్’ సినిమా విశ్వప్రసాద్ కి, నా సోదరి కృతికి పెద్ద హిట్ వస్తుందని ఆశిస్తున్నాను. నా స్నేహితుడు మారుతి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మిగతా దర్శకులు ప్రభాస్ ని చూసిన తీరు వేరు, మారుతి ప్రెజెంట్ చేసిన విధానం వేరు. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ప్రీమియర్స్ పడిన తర్వాత ప్రభాస్ పర్ ఫార్మెన్స్, మారుతి టేకింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ గురించే మీరంతా మాట్లాడుతారు. ప్రభాస్ గారు మన సినిమాను పాన్ ఇండియాకు తీసుకెళ్లారు. విశ్వప్రసాద్ మిరాయ్ సినిమా బాగా రన్ అవుతున్నా, ఓజీ, ఇతర సినిమాల కోసం థియేటర్స్ ఇచ్చారు. అలాంటి వారి సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని కోరుతున్నా. ‘ది రాజా సాబ్’ తో పాటు చిరంజీవి, వెంకటేష్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాలన్నీ హిట్ కావాలి. ప్రతి సారీ కోళ్ల మీద పందెం వేస్తారు. కానీ ఈ సారి డైనోసార్ మీద పందెం వేయండి. అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు పరిశ్రమ వర్గాల్లో కొంత గందరగోళం రేపినా ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగానే ఉంది. తర్వాత దీని గురించి ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి మరి.

Just In

01

VC Sajjanar: సొంత వాహనాల్లో సంక్రాంతికి వెళ్తున్నారా? సజ్జనార్ కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Harish Rao: కేసీఆర్ 18 చోట్ల టెలీమెట్రీలు ఏర్పాటు చేసిన విషయం గుర్తు లేదా? ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్!

The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Hyderabad Police: ఆహార కల్తీని హత్యాయత్నంగానే పరిగణిస్తాం.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!