Killer First Look
ఎంటర్‌టైన్మెంట్

Killer Movie: ఎస్‌జె సూర్య ‘కిల్లర్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Killer Movie: ఎస్‌జె సూర్య ఈ పేరుకి పరిచయం అక్కరలేదు. తన మల్టీ టాలెంటెడ్‌తో సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఎస్.జె. సూర్య.. దాదాపు పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రానికి ‘కిల్లర్’ అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయమూ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ కలిసి నిర్మిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా.. ఇక టికెట్స్ తెగడమే!

అలా లాంఛ్ చేశారో లేదో.. అప్పుడే చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. శనివారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.  ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా ఉంది. ఇందులో ఎస్.జె. సూర్య బ్లాక్ కోటు ధరించి షాట్ గన్ పట్టుకుని స్టయులీష్‌గా కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోగా, మరో పోస్టర్‌లో ఒకవైపు చేతిలో గన్ పట్టుకుని, రెడ్ డ్రెస్‌లో ఉన్న హీరోయిన్ ప్రీతి అస్రానీని భుజాన ఎత్తుకున్న లుక్ చాలా ఇంట్రస్టింగ్‌గా వుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై చాలా క్యురియాసిటీ‌ని పెంచుతున్నాయి. ఈ లుక్స్ తర్వాత ఈ సినిమా గురించి బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Fish Venkat: ఫిష్ వెంకట్ మృతికి వాళ్లే కారణమా.. ఫ్యాన్స్ సాయం తప్ప సినీ ఇండస్ట్రీలో ఒక్కరూ కూడా చేయలేదా?

అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పడం చూస్తేనే ఈ సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందనేది అర్థం అవుతోంది. ఇది ఎస్.జె. సూర్య, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో సినిమా కావడం విశేషం. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో ‘నాని, న్యూస్, అన్బే ఆరుయిరే, పులి’ సినిమాలు వచ్చాయి. భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా పాన్ ఇండియా అంతటా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎస్.జె. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇకపై వరుస అప్డేట్స్ వస్తాయని మేకర్స్ చెబుతున్నారు. చూద్దాం.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో. అందులోనూ ఈ మధ్య సూర్య ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే సూర్య రేంజ్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు