Madharaasi
ఎంటర్‌టైన్మెంట్

Madharaasi: ‘మదరాసి’ నుంచి లవ్ ఫెయిల్యూర్ యాంథమ్ విడుదల

Madharaasi: కోలీవుడ్‌లో ఫామ్‌లో ఉన్న హీరోలలో వెరీ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మదరాసి’. ఫస్ట్ టైమ్ ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ అద్భుతమైన థ్రిల్‌‌తో పాటు మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చేలా  ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణీ వసంత ఇందులో శివకార్తికేయన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లవ్ ఫెయిల్యూర్ యాంథమ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Anasuya Comments: ‘చెప్పు తెగుద్ది’.. ఆకతాయిలకు పబ్లిగ్గా అనసూయ వార్నింగ్!

ఇంతకు ముందు శివకార్తికేయన్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన టైటిల్ గ్లిమ్స్‌ మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అంటే ఇక్కడే సినిమా సగం సక్సెస్ అని ఫిక్సయిపోవచ్చు. ఇక ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘సెలవిక కన్నమ్మా’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.

లవ్ ఫెయిల్యూర్ యాంథమ్‌గా వచ్చిన ఈ పాటను గమనిస్తే.. ఇంతకు ముందు వచ్చిన టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండగా, ఈ పాట మాత్రం చాలా విభిన్నంగా ఉంది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయినప్పటికీ, డ్యాన్స్‌తో ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అనిరుధ్ రవిచందర్ కంపోజిషన్ డిఫరెంట్ వైబ్‌ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాస మౌళి ఈ పాటకు అందించిన లిరిక్స్‌ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ధనుంజయ్ సీపాన వోకల్స్, గ్రూవీ మ్యూజిక్, శివకార్తికేయన్ ఎఫర్ట్‌లెస్ స్క్రీన్ ప్రెజెన్స్.. అన్నీ కలగలిసి బ్రేకప్ జెనరేషన్‌కి ఇది లవ్ ఫెయిల్యూర్ యాంథమ్‌గా మారిపోయేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Also Read- Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!

ఈ చిత్రంలో విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సుదీప్ ఎలమోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో మరో మంచి సక్సెస్‌ను అందుకుంటానని శివకార్తికేయన్ ధీమా వ్యక్తం చేస్తుండగా, దర్శకుడు మురగదాస్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మురగదాస్‌కి అంత కీలకమైనది. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆయన చేసిన బాలీవుడ్ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. దీంతో.. ఈ సినిమా విజయం మురుగదాస్‌కు ఎంతో కీలకంగా మారింది. చూద్దాం మరి సెప్టెంబర్ 5న ఏం జరగబోతుందో..?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ