Singer Parnika: ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్స్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ నడిపించే వాళ్ళు స్టార్ సింగర్స్ తో ఇంటర్వ్యూ లు చేస్తున్నారు. ఇలా రోజూ ఎంతో మంది యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అయితే, తాజాగా సింగర్ పర్ణిక చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగులో ఎన్నో హిట్ పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలలో పాట పాడి అందర్ని మెప్పించి ఆడియెన్స్ తో మంచి మార్కులు వేపించుకుంది. ఇంకా యూట్యూబ్ లో కూడా మంచి కంటెంట్ చేస్తూ బిజీగా మారింది. సింగర్ గా ఎదగాలంటే మంచి వాయిస్ ఖచ్చితంగా ఉండాలి. అయితే, ఒక సమయంలో తన వాయిస్ మొత్తం పోయిందని ఏమోషనల్ అవుతూ తన బాధను చెప్పుకుంది.
సింగర్ పర్ణిక మాట్లాడుతూ.. ” నా ప్రగ్నెన్సీ టైమ్ లో వాయిస్ మొత్తం పోయింది. అప్పుడు ఏం చేయాలో కూడా అర్దం కాలేదు. నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఈ రోజుకి కూడా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు. నా పాత పాటలు చూసుకుంటే.. అప్పట్లో నా వాయిస్ చాలా బాగుంది కదా అనుకుంటాను. ఇప్పటికే ఎంతో మంది డాక్టర్స్ వద్దకు వెళ్ళాను, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాను కానీ, ఏది కూడా పని చేయలేదు. హార్మోన్స్ చేంజ్ అవ్వడం వలన అలా జరిగిందని తెలిసిందని చెప్పింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ ” అప్పుడు మాట్లాడటానికి అస్సలు రాలేదు. పీలగా వచ్చేది. నా వాయిస్ నాకు కూడా నచ్చేది కాదు. దానిని రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశా.. కానీ, అప్పుడు కూడా నరకం అనుభవించా.. దీని వలనే ముఖ్యమైన షోస్ వదిలేసుకున్నాను ” అంటూ ఎమోషనల్ అవుతూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.