Shreya Dhanwanthary: సెన్సార్‌పై నటి ఫైర్.. ఇలా ఐతే చూడరు!
Shreya Dhanwanthary ( image source; x)
ఎంటర్‌టైన్‌మెంట్

Shreya Dhanwanthary: సెన్సార్ తీరుపై నటి ఫైర్… ఇలా అయితే సినిమాలు చూడరు!

Shreya Dhanwanthary: ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు సినిమా ప్రియులను అసహనానికి గురిచేస్తుంది. సెన్సార్ బోర్డు నియమాలు కఠినతరం చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రతి సినిమాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేస్తుంది. దీనిపై సినిమా నిర్మాతలు, దర్శకులు అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. వందల మంది ఏళ్లకు ఏళ్లు కష్టపడి సినిమా తీస్తే సెన్సార్ బోర్డు ఒక్క నిమిషంలో సీన్లు తీసేసి సినిమాను నిర్వీర్యం చేస్తుందని వారు మండిపడుతున్నారు. సీన్ బాగుంటుందని దర్శకుడు నమ్మి మంచి సీన్ తీస్తే సెన్సార్ సభ్యులు వాటిని తీసేయడం సరికాదంటున్నారు. సినిమాలో మంచి సీన్లు లేకపోతే థియేటర్లకు ఎవరు రారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా సినిమాల్లో ఉండాల్సిన సీన్లు ఉండటం లేదంటున్నారు. తాజాగా ఇదే విషయం గురించి  సెన్సార్ బోర్డుపై నటి శ్రేయా ధన్వంతరి ఫైర్ అయ్యారు.

Also Read – Tesla in lndia: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ షురూ.. ప్లేసు, ముహూర్తం ఫిక్స్.. మీరు సిద్ధమేనా?

డేవిడ్‌ కొరెన్స్‌వెట్‌, రెచెల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సూపర్‌ మ్యాన్‌’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇండియన్‌ వెర్షన్‌లో ఒక సన్నివేశాన్ని సెన్నార్ బోర్డు కట్ చేసింది. దీనిపై నటి శ్రేయా ధన్వంతరి బోర్డుపై ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో 33 సెకన్ల పాటు హీరో, హీరోయిన్ ల మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. సెన్సార్ బోర్డు ఇలా చేయడం అర్థం పర్థం లేని చర్య అని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎవరూ రారన్నారు. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని సెన్సార్‌ వాళ్లు కోరుకుంటారు. పైరసీలను ప్రోత్సహించవద్దని అడుగుతారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి పనులు చేస్తారని, ఇలాంటి చర్యల వల్ల థియేటర్ అనుభూతిని ప్రేక్షకులు ఎలా పొందగలరని ప్రశ్నించారు. ప్రేక్షకులను చిన్న పిల్లల్లా భావించి సెన్సార్ బోర్డు థియేటర్‌ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తుందన్నారు. శ్రేయా ధన్వంతరి ‘జోష్‌’ సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌’, ‘చుప్‌’, ‘స్కామ్‌ 1992’ వంటి మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ కూడా నటించబోతున్నారు.

Also Read – Screen Time: పిల్లలు మొబైల్ వినియోగంపై అధ్యయనం.. వెలుగులోకి నమ్మలేని నిజాలు

ఇంతకు ముందు సెన్సార్ బోర్డు ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమాలో కూడా ఇలాగే వ్యవహరించింది. దీంతో సినిమాకు మరోసారి సెన్సార్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సినిమా విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. దీంతో సెన్సార్ బోర్డు ప్రతి సినిమాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ సినిమాలో జానకి అనే పదం గురించి సెన్సార్ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. టైటిల్‌లో జానకి అనే పదం ఉంచడమా, తీసివేయడమా అన్నది న్యాయస్థానం నిర్ణయించనుంది.

Just In

01

Farmer Sells Kidney: రోజుకు రూ.10 వేల వడ్డీతో రూ.1 లక్ష అప్పు.. భారం రూ.74 లక్షలకు పెరగడంతో కిడ్నీ అమ్ముకున్న రైతు

Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి