iBOMMA: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త సినిమా వస్తే చాలు పండుగ చేసుకునేవాడు. సినిమా తీసిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చేవాడు. ఇలా ఫస్ట్ ప్రింట్ రాగానే పైరసీ చేయడం, ఐబొమ్మ సైట్ లో అప్లోడ్ చేయడం. ఇక ఇదే అతని పని. ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. కాకపోతే చాలా ఆలస్యంగా పోలీసులు గుర్తించారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. సవాల్ ను సీరియస్ గా తీసుకుని .. ఐబొమ్మ నడిపే నిర్వాహకుడిని అరెస్ట్ చేసి చూపించారు.
అయితే, ఈ కేసులో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. చూడటానికి యంగ్ కుర్రాడిలా ఉన్నాడు. ఇంత పెద్ద మోసం ఎలా చేశాడంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఇమ్మడి రవి సినిమాలు, వెబ్ సిరీస్ లను పైరసీ చేయడం కోసం 100 కు పైగా వెబ్ సైట్లను కొన్నాడని పోలీసుల విచారణలో తేలింది. రవి పైరసీ నెట్ వర్క్ ను ప్రపంచ స్థాయిలో విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. యూకే కేంద్రంగా ఇతడి నేతృత్వంలో కొన్ని సాంకేతిక బృందాలు పని చేస్తున్నట్లు తెలిసింది.
ఇక కొద్దీ రోజుల క్రితం ” నన్ను అరెస్టు చేస్తే సినీ ఇండస్ట్రీతోపాటు పోలీసుల జీవితాలను కూడా బయటపెడతానంటూ రవి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి గుట్టు విప్పేస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో గత ఆరు నెలలుగా పోలీసులు రవి వేటలో ఉన్నారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనంతరం రవి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సర్వర్లు ఓపెన్ చేసి వెబ్‌సైట్ కంటెంట్‌ను పరిశీలిస్తున్నారు. ఐబొమ్మ పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు సుమారు రూ.3,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు పోలీసులు గతంలో వెల్లడించారు.
