Heroine Sister: ఎప్పుడూ హీరోయిన్లు గ్లామర్‌గా ఉన్నారు, బికినీలు, టూ పీస్ బికినీలు వేశారని, హీరోతో లిప్‌లాక్స్ చేశారని కాకుండా, అప్పుడప్పుడు వారు కానీ, వారి ఫ్యామిలీలోని మెంబల్స్ కానీ చేసిన మంచి పనులు కూడా వైరల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడో స్టార్ హీరోయిన్ సోదరి, ఓ గర్ల్ ఛైల్డ్‌ని రక్షించి వార్తలలో నిలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమె సోదరి ఎవరని అనుకుంటున్నారు కదా! రీసెంట్‌గా సూర్య హీరోగా వచ్చిన ‘కంగువ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీనే ఆ స్టార్ హీరోయిన్. ఆమె సోదరి ఖుష్బూ పటానీనే ఇప్పుడు ఓ గర్ల్ ఛైల్డ్‌ని రక్షించి, అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే..
Also Read- Sampath Nandi: రిలీజ్‌కు ముందే ‘ఓదెల 2’ బ్రేకీవెన్ అయింది.. ఎవ్వరూ తగ్గడం లేదుగా?
దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ 12 ఏళ్ల పాటు ఆర్మీలో మేజర్‌గా వర్క్ చేశారు. ఇటీవల రిటైర్‌మెంట్ తీసుకుని ఆర్మీ నుంచి వచ్చేసిన ఖుష్బూ పటానీ, ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉంటున్నారు. ఫిట్‌నెస్ వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేసే ఖుష్బూ పటానీ.. తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్మీలో పని చేసి వచ్చారంటే ఆమెకు ఎంత గుండె ధైర్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా ఆమె ఓ పాడుబడ్డ ఇంటిలో ఉన్న చిన్నారి ఏడుపులను గుర్తించి వెంటనే వెళ్లి రక్షించారు.
ఉత్తరప్రదేశ్ బరేలిలో నివసిస్తున్న ఆమె ఎప్పటిలానే జాగింగ్‌కు వెళ్లగా, తన ఇంటికి కొద్దిపాటి దూరంలో ఉన్న ఓ పాడుబడిన ఇంటిలో చిన్నారి ఏడుపు వినిపించింది. ఆర్మీలో పనిచేసిన ఆమెకు ఆ ఏడుపులో ఏదో తేడా అనిపించింది. అంతే ధైర్యంగా ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్లి, ఆ పాడుబడిన ఇంటిలోకి తొంగి చూసింది. అక్కడ ఓ చిన్నారి ఒంటి నిండా దెబ్బలు, మట్టితో నేలపై పడి ఏడుస్తూ ఉంది. ఆ చిన్నారిని అలాంటి పరిస్థితిలో చూసిన ఖుష్బూ పటానీ తట్టుకోలేకపోయింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని అమ్మలా లాలించింది. ఆ చిన్నారి ఆడపిల్ల కావడంతో పాప తల్లిదండ్రులు వదిలేశారనే విషయం ఆమెకు అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన ఖుష్బూ పటానీ.. పాప ఫేస్‌ను కూడా వీడియోలో క్లియర్‌గా చూపించి, ఆ పాప తాలుకా వాళ్లు వెంటనే సంప్రదించాలని కోరారు.
Also Read- Dragon: ‘ఎన్టీఆర్ నీల్’ కోసం ‘డ్రాగన్’ బయలుదేరింది.. ఫొటోలు వైరల్!
ఆ తర్వాత పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకోగానే, ఆ చిన్నారిని అక్కడి నుంచి తరలించి వైద్య పరీక్షలకు పంపించారు. ఆడపిల్ల అని ఆ చిన్నారిని అనాథగా వదిలేసిన పాప తల్లిదండ్రులపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతదానికి కనడం ఎందుకు? తప్పు, పాపం మీరు చేసి.. ఏ పాపం పుణ్యం తెలియని ఆ చిన్నారిని అలా అనాథగా వదిలేసినందుకు సిగ్గుపడండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం ఆడపిల్లలపై ఈ వివక్ష. సేవ్ గర్ల్ ఛైల్డ్. ఇక ఈ చిన్నారి జీవితం మారిపోతుందని, మంచి భవిష్యత్ లభిస్తుందని నమ్ముతున్నట్లుగా ఆమె షేర్ చేసిన వీడియోకు ఖుష్బూ పటానీ రాసుకొచ్చారు. ఆమెకు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. సేవ్ గర్ల్ ఛైల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంతో ఖుష్బూ పటానీ పేరు బాగా వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు