Dragon Update
ఎంటర్‌టైన్మెంట్

Dragon: ‘ఎన్టీఆర్ నీల్’ కోసం ‘డ్రాగన్’ బయలుదేరింది.. ఫొటోలు వైరల్!

Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌(Man Of Masses NTR) కు ఉన్న ఇమేజ్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రంతో ఆయన స్థాయి ప్రపంచానికి చేరింది. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలో చేస్తున్న ఈ యంగ్ టైగర్, ‘వార్ 2’ (War 2) చిత్రంతో డైరెక్ట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్‌పై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ‘కెజియఫ్, సలార్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను రూపొందించిన ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel)తో యాక్షన్ ఎపిక్ మూవీ ‘డ్రాగన్’ కోసం చేతులు కలిపారు. టైటిల్ అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత ఇటీవల ఓ ఈవెంట్‌లో టైటిల్ ఇదేనని వెల్లడించారు. అలాగే రాజమౌళి కూడా ఇటీవల ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్ సినిమా పేరు ‘డ్రాగన్’ అని చెప్పేశారు.

Also Read- Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతి‌పై రంజని ఫైర్!

ప్రస్తుతానికైతే ఈ సినిమాను ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఇక ఈ సినిమా రీసెంట్‌గా షూటింగ్‌ను ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజే భారీ అంచాలను ఏర్పరచుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఎన్టీఆర్ లేకుండానే ఈ షూట్ జరిగింది. దీంతో ఎప్పుడెప్పుడు తారక్ (Tarak) ఈ సినిమా సెట్స్‌లో అడుగు పెడతాడా అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు.

Jr NTR Dragon Update
Jr NTR Dragon Update

ఆ సమయం రానే వచ్చింది. ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను నిజం చేస్తూ ఆదివారం తారక్ హైదరాబాద్ నుంచి కర్ణాటకకు బయలుదేరారు. మైత్రీ నిర్మాతలలతో కలిసి ఆయన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపయ్యింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందోనని అంతా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Also Read- Rashmi Gautam: ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీ గౌతమ్‌కి ఏమైంది?

ఇప్పుడు సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారనే వార్త.. అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. యూనిక్ మాస్ విజన్‌తో తారక్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ