Anaganaga Oka Raju (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sankranthi Movies: సంక్రాంతి రేసు నుంచి రాజు తప్పుకుంటున్నాడా? కారణం ఆ తమిళ హీరోనేనా?

Sankranthi Movies: రాబోయే సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రణరంగంగా మారబోతుందనుకుంటే, తాజాగా వినిపిస్తున్న వార్త ఒకటి సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పండుగ బరిలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Chiranjeevi Mana Shankara Varaprasad Garu), ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (Prabhas The Raja Saab), రవితేజ- కిశోర్ తిరుమల (Ravi Teja and Kishore Tirumala) చిత్రం వంటి పెద్ద సినిమాలతో పాటు, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) కూడా ఉందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. జనవరి 14న విడుదల తేదీని కూడా లాక్ చేసి, ప్రమోషన్లను కూడా వైవిధ్యంగా మొదలుపెట్టారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. సంక్రాంతి రేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం ‘జననాయగన్’ (తెలుగు డబ్బింగ్) కూడా సంక్రాంతికే విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను నవీన్ పోలిశెట్టి సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Gummadi Narsaiah: నిజాయితీకి మారుపేరైన ఈ ఎమ్మెల్యే బయోపిక్ చేయడానికి తెలుగులో హీరోలే లేరా?

సంక్రాంతి రేసు నుంచి అవుట్

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకే నిర్మాణ సంస్థ రెండు సినిమాలు, అందులోనూ ఒక భారీ డబ్బింగ్ సినిమా, ఒక తెలుగు మీడియం రేంజ్ సినిమాను సంక్రాంతి బరిలో నిలపడం సాధ్యం కాదు. థియేటర్ల పంపిణీ, ప్రమోషన్స్ విషయంలో క్లాష్ తప్పదు. ఈ నేపథ్యంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరించి, తమ సొంత చిత్రం అయిన ‘అనగనగా ఒక రాజు’ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి, విజయ్ ‘జననాయగన్’ (Jananayagan) సినిమాను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి ‘అనగనగా ఒక రాజు’ చాలా కాలంగా విడుదలకు నోచుకోలేక వాయిదా పడుతూ వస్తుంది. గతంలో ‘జాతి రత్నాలు’తో సంచలనం సృష్టించిన నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read- Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

‘రాజు’ను పక్కన పెడుతుంది అందుకేనా?

దానికి తగ్గట్టుగానే వన్ మ్యాన్ ఆర్మీలా.. ఇప్పటి వరకు ఈ సినిమాను ప్రేక్షకులలో ఉంచడానికి నవీన్ పోలిశెట్టి శతవిధాలా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకొని నవీన్ ఇప్పటికే పలు వెరైటీ ప్రమోషనల్ వీడియోలు, టీజర్‌లు విడుదల చేసి, ప్రేక్షకుల్లో హైప్ పెంచాడు. ఈ దశలో సినిమాను వాయిదా వేస్తే, నవీన్ పోలిశెట్టితో పాటు అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురవడం ఖాయం. కమర్షియల్ లెక్కల కోసం ‘రాజు’ను పక్కకు తప్పిస్తున్నారేమోనని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే శివకార్తికేయన్ ‘పరాశక్తి’ మూవీ కూడా పొంగల్ రేసులో ఉన్న విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!