Sanjay Dutt: బాలీవుడ్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ అంటే తెలియని వారుండరు. నటుడిగా, నిర్మాతగా, సింగర్‌గా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి వైరల్ కామెంట్లు చేశారు. సౌత్‌లో యాక్షన్ సినిమాలకు కొరవలేదని అక్కడ చాలా మంచి యాక్షన్ హీరోలు ఉన్నారన్నారు. ఏ సినిమా పరిశ్రమలో అయినా యాక్షన్ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. మంచి యాక్షన్ సినిమా పడితే పరిస్థితులు మారిపోతాయని యాక్షన్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిదని ఆయన అన్నారు. ప్రస్తుతం యాక్షన్ సినిమాలు కన్నడ నుంచి ఎక్కువగా వస్తున్నాయని, ప్రేక్షకులు కూడా వాటిని ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలిపారు. అదే సందర్భంలో బాలీవుడ్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరని. ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ సినిమాలను మరచిపోతుందన్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ నుంచి మంచి యాక్షన్ సినిమా వస్తే బాగుంటుందని అబిప్రాయ పడ్డారు. దీంతో గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో మంచి యాక్షన్ సినిమాలు రాకపోవడంతో ప్రేక్షకులు సౌత్ సినిమాలవైపు చూస్తున్నారని తెలుస్తోంది.
Read Also- Shruti Haasan: రజనీ కాంత్ అలా చేస్తారని అనుకోలేదు.. శృతి హాసన్ స్టన్నింగ్ కామెంట్స్!
యాక్షన్ కింగ్ వారసుడు కన్నడ యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా ‘కేడీ ది డెవిల్’ సినిమా తెరకెక్కుతుంది. ధృవ సర్జా కన్నడతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు. యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘యూఐ’ మూవీ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రమేశ్ అరవింద్ , శిల్పా శెట్టి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ కోనంకి, నిషా వెంకట్ కోనంకి నిర్మిస్తున్నారు.
Read Also- Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?
‘కేడీ ది డెవిల్’ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ‘కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చాను సార్ రాస్కో.. తల దొరికింది, బాడీ లేదు’. అంటూ టీజర్‌లో సంజయ్ దత్ చెప్పిన డైలాగులు వింటుంటే ఈ సినిమాలో యాక్షన్ ఏ రెంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న హీరో ధృవ సర్జా ఇటీవల ‘మార్టిన్’ సినిమాతో వచ్చి మెప్పించాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.