ఎంటర్‌టైన్మెంట్

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

Sandeep Raj: ప్రముఖ సినీ అభిమాని, దర్శకుడు సందీప్ రాజ్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. 8 సంవత్సరాల క్రితం చేసిన ఒక పాత పోస్ట్‌ను తిరిగి పంచుకుని సినిమా ప్రపంచంపై తనకున్న అభిప్రాయం ఏమీ మారలేదని ఇందులో తెలియజేశారు. 2017, సెప్టెంబర్ 20న రాసిన ఈ పోస్ట్‌లో, అతను ఒక పెద్ద చిత్రం విడుదలకు ముందు తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అభిమానం, జోష్‌లో మార్పు రాలేదని ‘ఓజీ’ విడుదలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ పోస్ట్ చేశారు. ఆయన పాత పోస్ట్‌ను ఒకసారి గమనిస్తే..

‘‘జీవితం ఎన్ని సం*లు నాకుతున్నా, లైఫ్ ఎన్ని కష్టాల్లో ఉన్నా, పనులు ఆగిపోయినా, బ్రెయిన్ ఆలోచనలు లేక అల్లాడి పోతున్నా, బాస్ తిట్టినా, లవర్ అలిగినా.. పెద్ద సినిమా రిలీజ్ ముందు రోజు.. ఒక పండగ వాతావరణం, రేపు మనకి థియేటర్ అనే ఒక కొత్త ప్రపంచం, కొత్త ఉత్సాహం ఇస్తుంది అనే నమ్మకం’’ అని రాసి ఉంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా ఆయన రాసిన మాటలు వర్తిస్తాయి అని ‘ఓజీ’ మూవీ ప్రస్తావనను తీసుకొచ్చారు. 8 సంవత్సరాల క్రితం నేను చేసిన పోస్ట్ ఇప్పటికీ రిలవెంట్‌. ఇంకా కొన్ని గంటలే.. అని ‘ఓజీ’ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్ కూడా ‘అవును అన్నా.. మీరు చెప్పింది వంద శాతం నిజం’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!