Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) రూట్ మార్చిందా?. తన వ్యక్తిగత జీవితంలో ఇటీవలే కొత్త అధ్యాయాన్ని (రాజ్ నిడుమోరుతో వివాహం) ప్రారంభించిన తర్వాత, కెరీర్ పరంగా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై తను చేసే సినిమాలు ఎలా ఉండాలి? ఏయే పాత్రలు చేయాలి? అనే విషయంలో సమంత ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్‌లో ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై తాను నటించే సినిమాల్లో తన పాత్రే ప్రధానంగా ఉండాలని, అంటే కేవలం ‘లేడీ ఓరియంటెడ్’ కథలనే ఎంచుకోవాలని ఆమె ఫిక్స్ అయినట్లు సమాచారం. గ్లామర్ పాత్రలకు, కేవలం పాటలకే పరిమితమయ్యే హీరోయిన్ రోల్స్‌కు బై బై చెప్పేసిందనేలా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Super Star Krishna: మనవడు జయకృష్ణ ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే?
విడాకుల ఇష్యూను లాగుతున్న నెటిజన్లు
సమంత తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అయితే, కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని ఆమె గతాన్ని గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు. ‘‘నాగ చైతన్యతో పెళ్లి అయినప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది కదా’’ అనేలా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి సిరీస్‌లలో బోల్డ్ పాత్రలు చేయడం, ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే చైతూతో మనస్పర్థలు వచ్చాయని, ఆ కారణంతోనే విడాకులు తీసుకోవాల్సి వచ్చి ఉంటుందనేలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అప్పుడే అహం పక్కన పెట్టి, ఇలాంటి హోమ్లీ లేదా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తానని నిర్ణయం తీసుకుంటే.. విడాకులు, మళ్లీ రెండో పెళ్లి వరకు వచ్చేది కాదు కదా సామ్!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్‌పోజింగ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చి సంసారాన్ని ముక్కలు చేసుకున్నావంటూ నెగిటివ్ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.
Also Read- Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!
సమంత సమాధానం ఏంటి?
తనపై వస్తున్న ఈ విమర్శలకు, రెండో పెళ్లి తర్వాత వస్తున్న వార్తలకు సమంత ఎలా స్పందిస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. నిజంగానే ఆమె గ్లామర్ రోల్స్‌కు బైబై చెప్పిందా? లేక తన ఇమేజ్‌ను మార్చుకోవడానికి ఈ లేడీ ఓరియంటెడ్ ప్లాన్ వేసిందా? దీని వెనుక తన భర్త రాజ్ నిడిమోరు ఏమైనా ఉన్నారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా, సమంత తీసుకున్న ఈ షాకింగ్ డెసిషన్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఈ మధ్య సమంత సొంత బ్యానర్‌లో మాత్రమే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

