Super Star Krishna: మనవడు ఆవిష్కరించిన కృష్ణ కాంస్య విగ్రహం
Super Star Krishna statue (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Super Star Krishna: మనవడు జయకృష్ణ ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే?

Super Star Krishna: ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అపూర్వమైన సేవలు అందించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) కాంస్య విగ్రహాన్ని ఆయన మనవడు జయకృష్ణ ఘట్టమనేని (కృష్ణ కుమారుడు, మహేష్ సోదరుడైన రమేష్ బాబు కొడుకు) ఆవిష్కరించారు. ఎక్కడనుకుంటున్నారా? రీసెంట్‌గా కృష్ణ విగ్రహం నిమిత్తం సోషల్ మీడియాలో కొన్ని గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ జెండా ఉండాల్సిన చోట, కృష్ణ విగ్రహం పెట్టాలని కొందరు ప్రయత్నించారని, కానీ అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో.. చాలా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అగ్ర నిర్మాత అశ్వినిదత్, సినీ రాజకీయ ప్రముఖులు, సూపర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళులు అర్పించారు.

Also Read- Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!

బాబాయ్‌కి వీరాభిమానిని

విగ్రహ ఆవిష్కరణ అనంతరం హీరో జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైం అందరినీ ఇలాంటి గొప్ప కార్యక్రమం ద్వారా కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏం చేసినా.. తాత నా పక్కనే ఉంటూ నడిపిస్తుంటారనిపిస్తోంది, ఈరోజు కూడా ఆయన నా పక్కనే ఉన్నారనిపిస్తుంది. ఆయనతో గడిపిన సమయం, ఆయన నాకు చెప్పిన మాటలు, ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయ్ మహేష్ బాబు. ఆయన ఎప్పుడూ గైడెన్స్, సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఆయనకి నేను వీరాభిమానిని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. తాజాగా ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇది నా జీవితంలో ప్రౌడ్ మూమెంట్. మా బాబాయ్ నాకు ఇన్స్పిరేషన్.

Also Read- Nari Nari Naduma Murari Trailer: ఒక హీరో, రెండు లవ్ స్టోరీస్.. పరిష్కారం లేని సమస్య!

‘శ్రీనివాస మంగాపురం’తో వస్తున్నా..

40 ఏళ్ల క్రితం ఇదే రోజు అగ్నిపర్వతం సినిమా రిలీజైంది. ఆ సినిమాకు అశ్విని దత్ నిర్మాత. బాబాయ్‌ని కూడా ఆయనే లాంచ్ చేశారు. నన్ను కూడా ఆయనే లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నన్ను ఇంత బలంగా నమ్మినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను నా బెస్ట్ ఇస్తానని ఈ సందర్భంగా చెబుతున్నాను. బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. అలాగే కిరణ్‌‌కు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారంటే.. దానికి కారణం తాతయ్యే. ఈ సంవత్సరం నా మొదటి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) రాబోతోంది. యాక్షన్ లవ్ స్టోరీ. కథ చాలా బాగుంటుంది. దర్శకుడు అజయ్ భూపతి అద్భుతంగా తీస్తున్నారు. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను మంచి సినిమాలు, మంచి కథలతో మీ (ఘట్టమనేని ఫ్యాన్స్) ముందుకు వచ్చి.. అందరినీ గర్వపడేలా చేస్తాను. మీ సపోర్టు ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట!

Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?