Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో సామ్ మీద రూమర్స్ రాకపోతే ఆశ్చర్యపడాలి కానీ, వస్తే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా సమంత గురించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!
నాగ చైతన్య, శోభితను రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. సమంత కూడా మరో పెళ్లి చేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ చాలా కోరుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆమె రెండో పెళ్లి (Second Marriage) చేసుకునేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గత కొద్దీ రోజుల నుంచి ఓ స్టార్ డైరెక్టర్ తో సామ్ డేట్ చేస్తున్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయి. చివరికి అదే నిజమైందని అంటున్నారు.
Also Read: Bhogapuram Airport: ఈ విమానాశ్రయంతో మారనున్న దేశ రూపురేఖలు.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో Samantha ( Image Source: Twitter) సమంత పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గట్టిగానే టాక్ నడుస్తోంది. అంతే కాదు, ఈ మధ్య ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఏ చిన్న పార్టీ జరిగినా అతడు సామ్ పక్కనే ఉంటున్నాడు. పబ్లిక్ లో కూడా సమంత రాజ్ చేతులు పట్టుకొని క్లోజ్ గా ఉండటంతో అందరికీ అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక, ఆ రూమర్స్ ను నిజం చేస్తూ.. అతడినే పెళ్లి చేసుకునేందుకు సమంత సిద్దమైనట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలోనే .. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ విషయం గురించి చర్చలు జరిపి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
Also Read: Mahabubabad: మానుకోటలో నయా దందా.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు.. అధికారుల అండదండలతో!
దీనిలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. మే నెలలో వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి, సమంత ఇప్పుడైన వీటికి స్పందిస్తుందో? లేదో చూడాల్సి ఉంది. లేదంటే , తనే రెండో పెళ్లి గురించి అనౌన్స్ చేసి అందరికి బిగ్ షాక్ ఇస్తుందేమో చూడాలి.