Samantha: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో నాగ చైతన్య తో విడాకులు తీసుకుని ప్రస్తుతం సామ్ సింగిల్ గా ఉంటుంది. కానీ, చైతూ మాత్రం శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. అయితే, సమంత సినిమాలు చేయకుండా నిర్మాతగా బాధ్యతలు తీసుకొని శుభం చిత్రంతో మన ముందకొచ్చింది. అల్మోస్ట్ సక్సెస్ అయినట్టే తెలుస్తోంది. శుభం మూవీకి ఆశించిన కలెక్షన్స్ రావడంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. అంతే కాదు, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది.
Also Read: Heroine Divorce: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు.. ఆమె సడెన్ గా ఇండియాకు ఎందుకొచ్చింది?
ప్రస్తుతం సమంతకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ సంచలన నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు మూవీస్ లో నటించాలంటే, హీరోలతో పాటు సమానంగా పారితోషికాన్ని ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పేసిందట.
Also Read: Indian Overseas Bank Recruitment: డిగ్రీ అర్హతతో బ్యాంక్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి!
లేదంటే, కథ ఎంత మంచిగా ఉన్నా ఆమె కాల్షీట్ ఇవ్వదని అంటున్నారు. ఇప్పటికే దీని గురించి నిర్మాతలు చర్చలు జరిపారు. ఒక మూవీ హిట్ అవ్వడానికి హీరో మాత్రమే కాదని..హీరోయిన్ పాత్ర కూడా ముఖ్యం అని సమంత అంటోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఇద్దరికీ సమానంగా ఉండాలని సమంత అంటోందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.