Tollywood Heroine Divorce: స్టార్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లో కనిపించడమే మానేసింది. తెలుగులో ఇప్పటి వరకు 40 కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా, లయ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Indian Overseas Bank Recruitment: డిగ్రీ అర్హతతో బ్యాంక్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి!
ఈ ముద్దుగుమ్మ ఎన్నారై డాక్టర్ గణేష్ ని వివాహం చేసుకుని ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే, మళ్లీ తిరిగి చూసింది లేదు.. అప్పటి నుంచి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే, కొద్దీ రోజుల క్రితం లయ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండియాకు వచ్చింది. రెండు సినిమాలకు సైన్ కూడా చేసింది.
Also Read: Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
అయితే ఈ క్రమంలోనే లయ, ఆమె భర్తతో గొడవ పడి డివోర్స్ ఇచ్చేసి పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చేసిందనే రూమర్ బాగా వినబడుతోంది. అయితే, తాజాగా వీటిపై రియాక్ట్ అయిన లయ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” నేను, నా భర్తకు ఎందుకు విడాకులు ఇస్తాను.. మేము హ్యాపీగానే ఉన్నాము. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ” కొట్టి పారేసింది.