Salaar Part2: ‘సలార్ 2’ నుంచి షాకింగ్ అప్‌డేట్.. ప్లానింగ్ అదుర్స్
salar-2-updates
ఎంటర్‌టైన్‌మెంట్

Salaar Part2: ‘సలార్ 2’ నుంచి షాకింగ్ అప్‌డేట్.. దర్శకుడి ప్లానింగ్ అదుర్స్

Salaar Part2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందరి కళ్లు సీక్వెల్ ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ పైనే ఉన్నాయి. ఈ క్రమంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు బాబీ సింహా ఓ యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అదే సందర్భంలో సినిమా షూటింగ్ మార్చి నుంచి మొదలవుతుందని, దానికి అంతా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి లోనూ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. అంటే దాదాపుగా ఈ రెండు సినిమాల షూటింగ్ మార్చి లోగా అయిపోతుందన్న మాట. ప్రస్తుతం ప్రశాత్ నీల్ కూడా ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

Read also-Dhurandhar OTT: రేపే ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రశాంత్ నీల్..

దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ గురించి బాబీ సింహా ప్రశంసల వర్షం కురిపించారు. “ప్రశాంత్ నీల్ ఒక గొప్ప టెక్నీషియన్ మాత్రమే కాదు, సినిమాపై అమితమైన గౌరవం ఉన్న వ్యక్తి. ఆయన విజన్ చాలా స్పష్టంగా ఉంటుంది,” అని పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ సెట్స్‌లో ప్రతి సన్నివేశాన్ని ఎంత నిజాయితీగా తెరకెక్కిస్తారో, నటీనటుల నుండి ఉత్తమమైన అవుట్‌పుట్‌ను ఎలా రాబట్టుకుంటారో బాబీ వివరించారు. ముఖ్యంగా ఖాన్సార్ ప్రపంచాన్ని ఆయన సృష్టించిన విధానం భారతీయ సినిమాలో ఒక మైలురాయి అని కొనియాడారు.

యూనివర్సల్ కంటెంట్‌

‘సలార్ 2’ విషయంలో చిత్రబృందం ఎక్కడా రాజీ పడటం లేదని బాబీ సింహా స్పష్టం చేశారు. “మీరు చేసే పనిని ఆత్మసాక్షిగా ప్రేమిస్తేనే అది అద్భుతంగా వస్తుంది. ఫ్రేమ్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎంతో నిజాయితీగా ఉంటారు, ఎక్కడా క్వాలిటీ తగ్గనివ్వరు,” అని ఆయన అన్నారు. రెండో భాగంలో యాక్షన్ ఎమోషన్స్ మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ఉండబోతున్నాయని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. దక్షిణాది సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని, ‘సలార్’ వంటి సినిమాలు ఆ స్థాయిని మరింత పెంచాయని బాబీ అభిప్రాయపడ్డారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఏ భాషలోనైనా ఆదరిస్తారని, సలార్ 2 లో ఆ సత్తా పుష్కలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖాన్సార్ లోని రాజకీయాలు, దేవ వరదరాజ మన్నార్ మధ్య మారిన సమీకరణాలు ఈ రెండో భాగంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Read also-Gunasekhar: ‘చూడాలని వుంది’లోని లవ్ సీన్‌పై గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!

ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ప్లాన్ చేశారని, శౌర్యాంగ పర్వంలో దేవ (ప్రభాస్) విశ్వరూపం చూడబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే భారీ స్థాయిలో మిగిలిన షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. బాబీ సింహా ఇచ్చిన ఈ లీడ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాన్సార్ సింహాసనం కోసం సాగే ఈ రక్తపాతంలో దేవ – వరదల స్నేహం ఏ తీరానికి చేరుతుంది? శౌర్యాంగ పర్వ రహస్యాలు ఏంటి? అనేది తెలియాలంటే ‘సలార్ 2’ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. బాబీ సింహా మాటలను బట్టి చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మరో సునామీ రావడం ఖాయమనిపిస్తోంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?