Vichitra: హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడదే నేపథ్యంలో రవి (Ravi), శ్రేయ తివారి (Shreya Tiwari) హీరోహీరోయిన్లుగా సిస్ ఫిలిమ్స్ (SIS Films) బ్యానర్‌పై సైఫుద్దీన్ (Saifuddin Malik) మాలిక్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘విచిత్ర’ (Vichitra). నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను దర్శకనిర్మాత సైఫుద్దీన్ మాలిక్ తెలియజేశారు. పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
Also Read- The Raja Saab: ‘పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్‌లర్ నేనేలే’.. ‘రెబల్ సాబ్’ సాంగ్ ఎలా ఉందంటే?
‘విచిత్ర’ అంటే ఏమిటనేది తెరపైనే చూడాలి
ఈ సందర్బంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు కావాల్సిన తారాగణం కుదిరింది. రవి, శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. అందరూ కూడా అత్యద్భుతమైన నటనను కనబరిచారు. ‘విచిత్ర’ అంటే ఏమిటనేది తెరపైనే చూడాలి. ఈ సినిమా ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ (Mother Sentiment) నేపథ్యంతో రూపొందించాము. ప్రతి ఒక్కరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. కుటుంబంలోని తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా, హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇది మన ఇంట్లోని కథే కదా అని అంతా ఓన్ చేసుకుంటారని బలంగా చెప్పగలను. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ వాళ్లు కూడా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తూ, యుబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. (Vichitra Ready to Release)
Also Read- Akhanda 2: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ‘అఖండ 2’ టీమ్.. ఫొటోలు వైరల్!
త్వరలోనే విడుదల తేదీ
నిర్మాణం పరంగా చాలా సహజమైన ప్రదేశాలలో షూటింగ్ చేశాం. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. అందరూ ఇలాగే చెబుతారు కానీ, ఇందులో ఉన్న కంటెంట్‌పై నమ్మకంతోనే నేనిలా చెబుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో మా టీమ్ అంతా పనిచేసింది. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో చూపించాము. త్వరలోనే విడుదల తేదీని (Vichitra Release Date) ప్రకటిస్తాము. ప్రస్తుతం ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాము. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ఈ సినిమా గురించి మాట్లాడతాను’’ అని తెలిపారు. ఇందులో నటించిన హీరోహీరోయిన్లు కూడా ఈ సినిమా సక్సెస్‌పై నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

