Sai Pallavi in Bikini
ఎంటర్‌టైన్మెంట్

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Sai Pallavi: ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, సాయిపల్లవి లాంటి నేచురల్ బ్యూటీస్ మాత్రం చాలా అరుదుగా వస్తుంటారు. వారు వెళ్లిపోరు.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ స్థానం సంపాదించుకుంటారు. ఇది ఇప్పటి వరకు సాయి పల్లవిపై అభిమానులకు ఉన్న ప్రేమ, అభిమానం. కోట్ల రూపాయలు ఇస్తాం.. మా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండమని వెళితే.., దానిని నేను వాడనప్పుడు, అది నా ఫ్యాన్స్‌ని ఎలా వాడమని చెబుతాను అని సున్నితంగా తిరస్కరించి, ఆ అభిమానాన్ని రెట్టింపు చేసుకుంది. అలాగే, సినిమాలలో గ్లామర్ షో విషయంలోనూ ఆమె ఓ నిబంధన ప్రకారమే నడుచుకుంటుంది. నటన అంటే గ్లామర్ కాదు అని చెబుతూ.. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ.. లేడీ పవర్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అలాంటి సాయి పల్లవి సడెన్‌గా బికినీ (Sai Pallavi in Bikini)లో కనిపించే సరికి అంతా షాక్ అయ్యారు.

Also Read- OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

చెల్లి పూజ కన్నన్‌తో ఫారెన్ ట్రిప్‌లో..

ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది, సడెన్‌గా ఆమెను బికినీలో చూసి.. కేవలం అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాయి పల్లవికి ఏమైంది అంటూ.. గ్లామర్‌ని ఆస్వాదించే వాళ్లు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజమే మరి, ఎప్పుడూ నిండుగా కనిపించే సాయి పల్లవి సడెన్‌గా ఇలా కనిపిస్తే.. షాకవ్వకుండా ఉంటారా? ప్రస్తుతం తన చెల్లి పూజ కన్నన్‌తో ఫారెన్ ట్రిప్‌లో ఉన్న సాయి పల్లవి.. చెల్లితో కలిసి ఇలా బికినీలో దర్శనమిచ్చింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలపై ఎవరిష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ ఆమె బాలీవుడ్ ‘రామయణ’ అనే చిత్రంలో సీత పాత్రలో చేస్తుంది. అలాంటి సమయంలో ఇలా కనిపిస్తే.. అంతా ఏమనుకుంటారు.

Also Read- CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. బోనస్ ప్రకటించిన సర్కార్ ఒక్కొక్కరికి ఎన్ని లక్షలంటే..?

ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు

రీసెంట్‌గా కాజల్ అగర్వాల్ కూడా ఇదే పని చేసింది. ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీ దేవిగా నటించిన కాజల్.. ఆ సినిమా విడుదల సమయంలో ఫారెన్ టూర్‌లో భర్తతో కలిసి బికినీలో కనిపించి, అందరి ఆగ్రహానికి గురైంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు సాయి పల్లవి విషయంలో కూడా కొందరు అలానే రియాక్ట్ అవుతున్నారు. ఈ నేచురల్ బ్యూటీ అందరిలా కాదు, అని అనుకుంటున్న సమయంలో ఇలా బికినీలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అవుతున్నారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇంట్లో నేను నార్మల్‌గా పొట్టి దుస్తుల్లోనే ఉంటానని చెప్పింది.. కానీ, ఎప్పుడూ అవి బయటకు రాలేదు. ఈ ఫొటోలు ఇలా బయటకు రావడంతో అందరూ ఆమెను నిందిస్తున్నారు. అయినా, ఇది ఆమె పర్సనల్ లైఫ్. ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది.. అని వాదించే వారు కూడా ఉన్నారండోయ్.. చూద్దాం మరి.. ఈ బికినీ ఫొటోలపై సాయి పల్లవి ఏమైనా రియాక్ట్ అవుతుందేమో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?