Sai Kumar: తన కుమారుడు, వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ఈసారి తన పేరుని నిలబెడతాడని అన్నారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’ (Shambhala). యగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆది సాయి కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీలో నుంచి పలువురు ప్రముఖులు గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ ఎమోషనల్‌గా మాట్లాడారు.
Also Read- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ లింకులు తొలగింపు
కొన్ని తప్పటడుగులు పడ్డాయి
ఈ సందర్భంగా సాయి కుమార్ (Sai Kumar) మాట్లాడుతూ.. ‘‘మా అమ్మానాన్నలతో మొదలైన సినీ ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో ఇంకా కొనసాగుతోంది. నాన్న స్వరం, అమ్మ ఇచ్చిన సంస్కారం.. కళామతల్లి, ముక్కోటి దేవతల ఆశీర్వాదం, ప్రేక్షకులందరి అభిమానంతో ఈ జర్నీ ఇంకా అలా సాగిపోతుంది. 1975లో నేను హీరోగా పరిచయం అయ్యాను. 2011లో ‘ప్రేమ కావాలి’తో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి అడుగు మంచి సక్సెస్ అయ్యింది. రెండో అడుగు ‘లవ్‌లీ’ కూడా మంచి హిట్టయింది. ఆ తర్వాత కూడా అడుగులు వేస్తూనే ఉన్నాడు. కానీ, కొన్ని తప్పటడుగులు పడ్డాయి. జయాపజయాలు మన చేతుల్లో ఉండవ్. కానీ వెనకడుగు వేయకుండా తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేస్తుండటమే సక్సెస్ అని అంటుంటారు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆ గెలుపు ‘శంబాల’తో ఆదికి రాబోతుంది. ఎందుకంటే, నిర్మాతలు మంచి కంటెంట్‌తో రాబోతున్నారు. నిజంగానే మునిలా యుగంధర్ ఈ మూవీకి పని చేశారు. మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు.
Also Read- Shambhala: ‘శంబాల’తో నాన్న కోరిక తీరుతుంది- ఆది సాయి కుమార్
అభిమానుల పేరు, నా పేరును నిలబెడతాడు
గత డిసెంబర్‌లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పటి వరకు పాజిటివిటీ ఏర్పడుతూనే వచ్చింది. దీనికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు. దుల్కర్, ప్రభాస్, నాని ఇలా అందరూ ‘శంబాల’కు సపోర్ట్ చేశారు. నాని విడుదల చేసిన ట్రైలర్ ఇండియాలోనే టాప్ 3లో ట్రెండింగ్‌లో ఉంది. అందుకు సంతోషంగా ఉంది. దీనికి కారణం కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారనేదే. కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి, ప్రియదర్శి ఇలా అందరూ నాకు ఫ్యామిలీ లాంటివారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తప్పకుండా ఈసారి అభిమానుల పేరు, నా పేరుని ఆది నిలబెడతాడు. అంత నమ్మకం ఎందుకంటే మైత్రి శశి ఈ మూవీని చూసి హిట్ అవుతుందని చెప్పడంతో పాటు, ఆదికి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని అనడంతో నాలో కొత్త ఎనర్జీ మొదలైంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ ‘శంబాల’ విజయం ఆదికి చిత్రోత్సాహాన్ని, ఈ టీమ్‌కు విజయోత్సాహాన్ని, నాకు పుత్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని, ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను. డిసెంబర్ 25న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

