dialog-king (image source:x)
ఎంటర్‌టైన్మెంట్

Dialogue King Sai Kumar: ‘డైలాగ్ కింగ్’ పవర్ వాయిస్‌ నుంచి.. పవర్ ఫుల్ పర్సన్

Dialogue King Sai Kumar: విలక్షణ నటుడు సాయి కుమార్ పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగ్​లు మన కళ్ల ముందు మెదులుతాయి. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. జూలై 27  ఆయన 65వ పుట్టిన రోజు. ఈ ఏడాదితోనే ఆయనకు నటుడిగా 50 ఏళ్లు నిండాయి. ఈ 50ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన సాయి కుమార్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇలాంటి అద్వితీయ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

Read also- Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?

1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించింది. నటుడిగా 50వ ఏటలోకి అడుగు పెట్టిన సాయి కుమార్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో నటించి మెప్పించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఏడాది సాయి కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ‘కోర్ట్’ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే దేవా కట్టా ‘మయసభ’, క్రిష్ తెరకెక్కిస్తున్న ‘కన్యా శుల్కం’ అంటూ అలరించబోతోన్నారు.

Read also- Vijay Deverakonda: బలుపు మాటలు తగ్గించుకో.. లైగర్ దెబ్బ మర్చిపోయావా..? విజయ్ దేవరకొండకి స్వీట్ వార్నింగ్ ఇస్తున్న నెటిజన్స్

కొత్త తరం ఆర్టిస్టులు వస్తున్నా, గట్టి పోటీ ఏర్పడినా.. నటుడిగా 50 ఏళ్లు గడిచినా కూడా సాయి కుమార్ ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ.. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, అల్లరి నరేష్ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాధి రాజా’, కోన వెంకట్ గారితో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డితో మరో చిత్రం అంటూ ఇలా ఫుల్ బిజీగా ఉన్నారు. సాయి కుమార్ తన తనయుడు ఆదితో ‘ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇక సాయి కుమార్ నట వారసత్వాన్ని కూడా ఆది ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆది త్వరలోనే ‘శంబాల’ అంటూ అందరినీ మెప్పించబోతూన్నారు. సాయి కుమార్ ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని అభిమానులు, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు