Kannappa: ‘సగమై.. చెరిసగమై’.. ఈ సోమవారం స్పైసీ ట్రీట్
Kannappa Movie Still
ఎంటర్‌టైన్‌మెంట్

Kannappa: ‘సగమై.. చెరిసగమై’.. ఈ సోమవారం స్పైసీ ట్రీట్

Kannappa Song: మంచు విష్ణు (Manchu Vishnu), ప్రీతి ముకుందన్ మూవీ ‘కన్నప్ప’ నుంచి ఈ సోమవారం మేకర్స్ మాంచి స్పైసీ ట్రీట్ ఇచ్చారు. ఇంతకు ముందు భక్తి గీతంతో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిన టీమ్, ఇందులో రక్తికి కూడా చోటు ఉందని తెలిపేలా, ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాంగ్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మంచు విష్ణు, ప్రీతి ముకుందన్‌ల కెమిస్ట్రీ పాట పైనే కాదు, సినిమాపై కూడా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కాకపోతే అక్కడక్కడా నెగిటివ్ టాక్‌కు కూడా ఈ పాట కారణమవుతుంది. ఈ పాట, పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ చూసిన వారంతా ఇది భక్తి సినిమానా? లేక రక్తి సినిమానా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇందులో మంచు విష్ణు అన్ని రకాల ఎలిమెంట్స్‌ని జోడించారనేది ఈ పాటతో అర్థమవుతుందంటూ, పాటకు లైక్స్ కొడుతున్నారు. ఇక పాట విషయానికి వస్తే..

Also Read- India Won: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భారత్.. సెలబ్రిటీల రియాక్షన్ చూశారా!

‘‘సగమే, చెరి సగమే ఇక నువ్వూ నేనూ.. ఒక జగమై, నీ జతగా అడుగేస్తున్నాను.. ఇరు పెదవుల శబ్దం, విరి ముద్దుల యుద్ధం.. మెలి తిప్పిన మీసం, నా నడుమంచున మడతెంచితే’’ అంటూ శ్రీమణి ఇచ్చిన సాహిత్యం ఈ పాటకు హైలెట్‌గా ఉంది. అంతే గొప్పగా ఈ పాటను సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచారు. రేవంత్, సాహితి చాగంటి వాయిస్‌లో ఈ పాట వినసొంపుగా ఉండటమే కాకుండా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. ఈ పాటకు ప్రభుదేవా, బృంద మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసినట్లుగా మేకింగ్‌ని కూడా ఇందులో చూపించారు. మేకింగ్ విజువల్స్ చూస్తుంటే, కెమెరా పనితనాన్ని పొగడకుండా ఉండలేము. కూల్ వాతావరణంలో ఈ పాటను చిత్రీకరించిన తీరు పాటకి మరో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ప్రతి సోమవారం వచ్చే అప్డేట్స్‌తో ‘కన్నప్ప’ (Kannappa Movie) చిత్రం వారమంతా వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ఈ వారం మాత్రం అసలు మరిచిపోలేని విధంగా మేకర్స్ స్పైసీ ట్రీట్ ఇచ్చారు. శివ భక్తుడైన ‘కన్నప్ప’ కథతో వస్తున్న ఈ చిత్రంలో అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి అతిరథమహారథులు నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ (Prabhas), బ్రహ్మానందం, కాజల్ వంటి వారు ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan Babu) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:
Ananya Panday: బికినీలో.. ‘లైగర్’ బ్యూటీ కంట్రోల్ తప్పింది

Ram Gopal Varma: పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు? వర్మ సమాధానమిదే!

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!