RT76: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) 76వ చిత్రం గురువారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. హిట్టు, ఫ్లాప్స్‌తో పని లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరో ఎవరయ్యా? అంటూ అందరూ చెప్పే పేరు మాస్ మహారాజా రవితేజ. ఏడాదికి మినిమమ్ 2 రెండు సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో ఎందరికో జీవనోపాధి లభించేలా చేస్తున్న మాస్ మహారాజాకు.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు. ఆ మధ్య ‘ధమాకా’ రూపంలో మాంచి హిట్ వచ్చినా, ఆ తర్వాత చేసిన చిత్రాలేవీ అంతగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి. అయినా సరే, రవితేజకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హీరోగా ఆయన బిజీబిజీగా ఉంటూనే ఉన్నారు. తన పని తను సక్రమంగా చేశానా? లేదా? అని మాత్రమే ఆలోచించే రవితేజతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. తాజాగా ఆయన ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Also Read- Janhvi Kapoor and Nani: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ఇద్దరూ ఏదో మెసేజ్ ఇస్తున్నారే!
ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి రవితేజ శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎఫర్ట్ లెస్ యాక్టింగ్, అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో అలరించే మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు మాస్టరైన దర్శకుడు కిషోర్ తిరుమల (Kishore Tirumala)తో కలిసి తన 76 చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభమైంది. రవితేజ సిగ్నేచర్ స్టయిల్, కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని దర్శకుడు కిషోర్ తిరుమల సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో పాటు రవితేజ ఎనర్జీకి ధీటుగా ఉండే సినిమా ఇదవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read- Pottimama: ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ పొట్టిమామ గురించి తెలుసా?
ఈ సినిమా అనౌన్స్ చేస్తూ.. రవితేజకు సంబంధించి ఓ స్టైలిష్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో డిజైనర్ సూట్ ధరించిన రవితేజ, ఎయిర్ క్రాఫ్ట్ సీటులో దర్జాగా కూర్చుని ఉన్నారు. తన ముందు సీటుపై ఒక కాలు క్యాజువల్‌గా ఆనించి.. ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నారు. రవితేజ మోస్ట్ స్టైలిష్ లుక్‌ను సూచిస్తున్న ఈ పిక్‌లో, ఆయన పట్టుకున్న పుస్తకంపై ‘సీ ఇట్ అండ్ సే ఇట్’ అని స్పానిష్‌లో ఉంది. ఇది రవితేజ పాత్రకి సంబంధించిన సిగ్నల్‌గా అనిపిస్తోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ధమాకా’ చిత్రానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా, అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, AS ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 16 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని, 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్‌కు తీసుకువస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు