Tuk Tuk Release Date: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి.. ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘టుక్ టుక్’. యంగ్ టీమ్ నటిస్తున్న హోల్‌సమ్ మ్యాజికల్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తేదీని ఖరారు చేశారు. సి. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో చిత్రవాహిని మరియు ఆర్‌వైజి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ (Supreeth C Krishna)లు నిర్మాతలు. ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మహా శివరాత్రి కానుకగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేశారు.
Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?
మ్యాజికల్ పవర్స్ ఉన్న స్కూటర్ కమ్ ఆటో
ఈ పోస్టర్‌ని గమనిస్తే.. ప్రధాన తారాగణం అంతా రిలీజ్ డేట్‌ని చూపిస్తున్నట్లుగా కలర్ ఫుల్‌గా ఉంది పోస్టర్. ఈ పోస్టర్ సినిమాపై మంచి ఫీల్‌ని కలిగిస్తోంది. రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా దర్శకుడు సి సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యభరితమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలు చిన్నవైనా, పెద్దవైనా అఖండ విజయాన్ని సాధిస్తుంటాయి. తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో సినిమాలను ఆదరిస్తున్న తీరు చూసిన వారెవరైనా ఇదే చెబుతారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో ‘టుక్ టుక్’ని రెడీ చేస్తున్నాము. న్యూ ఏజ్ స్టోరీగా, ఇందులో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే స్కూటర్ కమ్ ఆటో ఎన్నో మ్యాజికల్ పవర్స్‌ను కలిగి ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమా చూసిన అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు. కేవలం వాహనంగా మాత్రమే కాకుండా ఓ మంచి రహస్యం కూడా మిక్స్ చేశాము. సినిమాలో అందరినీ ఎంటర్‌టైన్ చేసే ప్రధమ బాధ్యతని అదే తీసుకుంటుంది. యువతరం నచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు కూడా ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే విశ్వాసముందని అన్నారు.

ఈ వేసవికి ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా!
‘‘సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన ‘టుక్ టుక్’ చిత్రం, ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం. అసలు కథలో ఆ స్కూటర్ కమ్ ఆటో పాత్ర ఏంటి? అనేది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక గ్రామం నేపథ్యంలో నడిచే కథ ఇది. తప్పకుండా చిత్రం అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి మార్చి 21న మా ‘టుక్ టుక్’ని థియేటర్లలోకి తీసుకువస్తున్నామని, మా ప్రయత్నాన్ని అంతా సక్సెస్ చేయాలి’ అని నిర్మాతలు కోరారు.