mass-jatara( IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: ‘మాస్ జాతర’పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు.. రిలీజ్ అప్పుడే!

Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara film). ఈ సినిమా ఆగస్టు 27 2025న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడిందంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెలిపింది. ఈ సినిమా వినాయక చవితికి రాదని క్లారిటీ వచ్చేసింది. విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమా విడుదలపై జాప్యం జరగుతోంది. ఇప్పటికి విడుదల తేదీలు ప్రకటించి పోస్ట్ పోన్ చేయడం ఇది మూడవ సారి. దీనికి సంబంధించిన వార్త మాత్ర సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఆగస్టు 27 2025న విడుదల అవ్వాల్సిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31 2025న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు డిస్టిబ్యూటర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. అయిదే దీనికి కారణం మాత్రం తెలియాల్సి ఉంది. వరుసగా ‘కింగ్డమ్’, ‘వార్ 2’ సినిమాలు నష్టాలు రావడంతో ఈ సినిమా వాయిదా వేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘మాస్ జాతర’పైనే నిర్మాత ఆశలు మొత్తం పెట్టుకున్నారని, ఈ సినిమా కూడా మిక్సుడ్ టాక్ వస్తే నిర్మాత మరింత నష్టాల్లో కూరుకుపోతారు. అయితే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఎలాగైనా ఈ సినిమా హిట్ సాధించాలనే ఉద్దేశంతో నిర్మాత ఉన్నారని సమాచారం. అందుకే ఈ సినిమా విడుదల విషయంలో డిలే అవుతుందని తెలుస్తోంది.

Read also-Indian Railways: రైళ్లల్లో విచిత్రమైన సమస్య..15 వేలకు పైగా ఫిర్యాదులు.. మీరూ ఫేస్ చేశారా?

“మాస్ జాతర” రవితేజ 75వ సినిమా, భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ స్టైలిష్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీం సేసిరొలియో అందిస్తున్నాడు. టీజర్, ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రవితేజ స్టైల్, ఎనర్జీతో పాటు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపిన మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

Read also-Mother kills daughter: రాష్ట్రంలో ఘోరం.. 3 ఏళ్ల కూతుర్ని చంపి తల్లి కూడా.. కారణం తెలిస్తే షాకే!

మొదట ఈ సినిమా మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు, తర్వాత ఆగస్టు 27కి మార్చారు. కానీ టాలీవుడ్ స్ట్రైక్ వల్ల ఆ తేదీ కూడా కుదరలేదు. ఇప్పుడు దీన్ని దీపావళి సీజన్‌లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. “ఓలే ఓలే” పాట, టీజర్ ట్రెండింగ్ అవుతున్నాయి, ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటలు, ఎమోషనల్ డ్రామా మొత్తం కలిపి రవితేజ ‘మాస్ జాతర’ పండగ మూడ్‌లో ఆడియన్స్‌ని అలరించనుంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు