Shashtipoorthi Song Release Event
ఎంటర్‌టైన్మెంట్

Ravi Teja: అన్నయ్య ‘షష్టి పూర్తి’ని అందరూ చూడండి

Ravi Teja: నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్‌లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ పాట మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా రెండో పాటను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

Aslo Read- Renu Desai: నా రెండో పెళ్లే మీకు ముఖ్యం.. అంతేనా!

ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య నటించిన ‘షష్టి పూర్తి’ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూడండి. కచ్చితంగా బావుంటుంది. ఈ సాంగ్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంకా చెప్పేదేముంది. దర్శక నిర్మాతలకు, ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. ఈ పాటను విడుదల చేసిన రవితేజకు ‘షష్టి పూర్తి’ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ పాట విషయానికి వస్తే..

‘ఇరు కనులు కనులు కలిసి’ అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. ఈ పాట వివరాలను దర్శకుడు పవన్ ప్రభ తెలుపుతూ.. సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’లో ‘మౌనమేలనోయి’ పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్‌కి గీత రచయిత రెహమాన్ శరవేగంతో సాహిత్యం సమకూర్చారు. ఆయన ఇచ్చిన సాహిత్యానికి ఇళయరాజా ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. అలాగే ఈ పాట రికార్డింగ్ చాలా లవ్లీ‌గా, లైవ్లీ‌గా జరిగింది. సింగర్స్ ఎవరిదారిన వాళ్ళు వచ్చి పాడి వెళ్లిపోకుండా.. ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఓ ఫీల్‌తో ఈ డ్యూయట్‌ని ఆలపించారు.

Also Read- Vaani Kapoor: ఈ అందంతోనే ఇంకా నెట్టుకొస్తుంది.. ఫొటోలు వైరల్!

కథలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని, కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా జన్మధన్యమైంది. ఈ పాట చిత్రీకరణని రాజమండ్రి‌లో ఈశ్వర్ నృత్య దర్శకత్వంలో తీశాం. మంచి ఎండల్లో అందరూ కష్టపడి, ఇష్టపడి ఈ పాట బాగా రావడానికి సహకరించారు. మామూలుగానే గోదావరి అందంగా ఉంటుంది. ఇక తోట తరణి కళా దర్శకత్వ నైపుణ్యంతో ఈ పాటలో గోదావరి రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మా హీరో హీరోయిన్లు రూపేష్, ఆకాంక్ష సింగ్‌లపై ఈ పాటను చిత్రీకరించామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు