Ravi Teja: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఈ సారి పండుగ బరిలో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) తనదైన శైలి వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). క్రిస్మస్ పండుగ (Merry Christmas) సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రిస్మస్ పోస్టర్‌లో రవితేజ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. తలకు సాంటా క్యాప్ పెట్టుకుని, చేతిలో క్రిస్మస్ గిఫ్ట్ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న రవితేజ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో పండుగ వాతావరణంతో పాటు, రవితేజ మార్కు ఎనర్జీ పుష్కలంగా ఉండబోతోందని అర్థమవుతోంది.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!
క్రేజీ కాంబినేషన్ – మ్యాసీవ్ బజ్
ఈ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్.. ‘క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు, సంక్రాంతికి థియేటర్లలో కలుద్దాం’ అనే సందేశాన్ని ఈ పోస్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. రవితేజ క్రిస్మస్ అవతార్ చూశారా? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మాస్ రాజా రవితేజ ఎనర్జీకి, కిషోర్ తిరుమల క్లాస్ మేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ సాధించి, సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇంకా కమెడియన్స్ టీమ్ అంతా ఇందులో నటిస్తున్నారనే విషయం ఇప్పటికే వచ్చిన టీజర్ హింట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
Also Read- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు
సంక్రాంతికి వినోదాల విందు
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలు, భావోద్వేగాలతో పాటు రవితేజ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతి పండుగకు కుటుంబం అంతా కలిసి చూసే పర్ఫెక్ట్ మూవీగా దీనిని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పండుగ రేసులో రవితేజ తన మాస్ పవర్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా రవితేజ కెరీర్‌కు ఎంత ఇంపార్టెంటో తెలియంది కాదు. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ, ఈ సినిమాతో బంపర్ హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. చూద్దాం.. ఆయన నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో..
#BMW Team Wishing you all a MERRY CHRISTMAS🎄🎉
This Sankranthi, entertainment will have a new C/O address 💥💥#BharthaMahasayulakuWignyapthi GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026 ❤🔥
ICYM the #BMWTeaser
▶️ https://t.co/K3VwznvT5k@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/3zd6CM1OyH— SLV Cinemas (@SLVCinemasOffl) December 25, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

