Rashmika Mandanna: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో నిశ్చితార్థం చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పేరు టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ ట్రెండ్‌ని మరింత ఉదృతం చేసేందుకు, ఇప్పుడామె చేస్తున్న సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. రష్మిక మందన్నా, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్ర విడుదల తేదీని శనివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) రూపొందిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ, మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read- Rahul Ramakrishna: నేనొక చిన్న నటుడ్ని.. నా బాధ్యత తెలుసుకున్నా.. ట్విట్టర్‌కు గుడ్ బై!
ప్రేమికుల్లో ఎంతమందికి ఈ క్లారిటీ ఉంటుంది?
మేకర్స్ విడుదల చేసిన వీడియోలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రేమికులుగా మనం ఒకే టైపా, ఒకరికొకరం ఎంతవరకు కరెక్ట్? రకరకాల కారణాలతో కలిసే ప్రేమికుల్లో ఎంతమందికి ఈ క్లారిటీ ఉంటుంది? మీకు ఉందా? నవంబర్ 7న థియేటర్స్‌కు రండి డిస్కస్ చేద్దాం..’ అంటూ ఈ వీడియోలో ప్రేక్షకులను రష్మిక, దీక్షిత్ ఇన్వైట్ చేస్తున్నట్లుగా చూపించారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇన్నోవేటివ్‌గా ఉండటంతో పాటు, ఓ మంచి ప్రేమకథ రాబోతుందనే విషయాన్ని ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ స్పందనను రాబట్టుకోవడంతో పాటు, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అనేలా వెయిట్ చేసేలా చేసింది. ఆ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
Also Read- Vijay Rashmika: సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం
త్వరలోనే టీజర్
రష్మిక మందన్నా హైలెట్‌గా వస్తున్న ఈ సినిమాపై గ్యారంటీ హిట్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం నుంచి వచ్చిన ‘కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మతిచెడెనా ఏమో’ అంటూ సాగిన ‘ఏం జరుగుతుంది’ లిరికల్ వీడియో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇందులోని పాటలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయనేది ఈ ఒక్క సాంగ్‌లోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై వరసగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని, త్వరలోనే టీజర్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
