Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో నిశ్చితార్థం, ‘థామా’ రిలీజ్ వంటి విషయాలతో వార్తలలో హైలెట్ అవుతున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇప్పుడు తను నటిస్తున్న మరో సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ట్రెండ్‌లోకి వచ్చింది. రష్మిక, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ఈ సినిమాను అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని (The Girlfriend Trailer Launch) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
Also Read- Megastar Chiranjeevi: ఇకపై చిరంజీవి పేరు, ఫొటోలను ఎలా పడితే అలా వాడారో..!
నా మనసుకు దగ్గరైన చిత్రం
ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ‘ది గర్ల్ ఫ్రెండ్’.. ఈ సినిమా కథ విన్నప్పుడే సరికొత్త ప్రేమకథ అని అనిపించింది. ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటి వరకు మనం చూడలేదనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా.. అనే ఫీల్ కలిగింది. ఇందులో నేను భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్‌తోనే మన విషయాలను కొన్నింటిని షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ట్రైలర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ప్రజంట్ చాలా మూవీస్ చేస్తున్నప్పటికీ.. నాకెందుకో ఈ సినిమా చేయడం చాలా ముఖ్యమని అనిపించింది. ఎందుకంటే, నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే కూడా మంచి మూవీ చేయాలనే తపన ఉంటుంది. మంచి కథను ఆడియెన్స్ దగ్గరకు చేర్చాలని అనిపిస్తుంది. మొదటి నుంచి నా మూవీ ఏదైనా సరే.. థియేటర్స్‌కు వెళ్లి చూసిన ప్రేక్షకులు ఏదో ఒక మంచి ఫీల్‌తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో తీసుకున్న రైట్ డెసిషన్ ఈ ప్రాజెక్ట్. ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ ఎప్పటికీ నిజం కావు. దీక్షిత్ వంటి కోస్టార్‌తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ. ఇది నా మనసుకు దగ్గరైన చిత్రం. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత.. దగ్గరలోనే మరో ట్రీట్!
విజయ్ దేవరకొండ గెస్ట్‌గా
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథను రాహుల్ నాకు నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఆహాకు వెబ్ సిరీస్‌లా చేయాలనేది మొదట ప్లాన్. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా అయితే బాగుంటుందని అనిపించేది. ఆ తర్వాత మేము ఎప్పుడు కలిసినా.. ఈ కథ గురించి రాహుల్‌కు గుర్తుచేసేవాడిని. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. అంత హెవీ పెర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు? అని అంతా అనుకున్నప్పుడు.. అందరూ రష్మిక పేరే చెప్పారు. తను నాకు కూతురు వంటిది. ఈ సినిమాతో ఆమెకు ఎన్నో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి. ఈ సినిమా చూశాకే దీక్షిత్ ఎంత మంచి పెర్ఫార్మరో నాకు అర్థమైంది. రష్మిక, దీక్షిత్‌తో ఒక ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. నిజంగా అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతనే చేశాడా అనిపిస్తుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండను గెస్ట్‌గా తీసుకొద్దామని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
