Ramayana The Introduction: ” రామాయణం: ది ఇంట్రడక్షన్ ” త్వరలో మన ముందుకు రాబోతుంది. మన చిన్నప్పటి నుంచి రామాయణం వింటూనే విన్నాము. అయితే, దీన్ని ఒక సినిమాగా తెరకెక్కించి అందరికీ చూపించాలనే ఆశతో బాలీవుడ్ ఒక అడుగు ముందుకేసింది. ఇది వాల్మీకి రామాయణం ఆధారంగా రెండు భాగాల లైవ్-యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ చిత్రం భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యంత ఆధునిక సినిమాటిక్ టెక్నాలజీతో, విజువల్ ఎఫెక్ట్స్‌తో (VFX) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రామాయణం’ ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు రిలీజ్ అయింది.
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!
దంగల్ తో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ నితేష్ తివారీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG), యష్ (మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్), అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
నటినటులు ఎవరెవరు నటిస్తున్నారంటే?
రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్, సీతగా తెలుగు హీరోయిన్ సాయి పల్లవి, ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ చేయగా, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అయితే, పార్ట్ 1: దీపావళి 2026, పార్ట్ 2: దీపావళి 2027 వస్తుందని అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు.
Also Read: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్‌లో రామ్‌కు ఊహించని ఘటన.. వెంటనే అలెర్ట్ అయ్యారు
ఈ సినిమా రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతుంది. శ్రీరాముడు, రావణుడి మధ్య జరిగిన యుద్దాన్ని ఈ చిత్రంలో మనం చూడొచ్చు. శ్రీరాముడి పుట్టుక నుండి అయోధ్యలో పట్టాభిషేకం వరకు, సీతాపహరణం, హనుమంతుడి వీరత్వం, రావణ సంహారం వంటి ముఖ్య సన్నివేశాలను ఈ సినిమాలో మనకీ చూపించబోతున్నారు.