Andhra King Taluka teaser: రామ్ పోతినేని హరోగా తెరకెక్కుతున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. మహేష్ బాబు పి. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 28, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం, ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్యాన్ కల్చర్‌ను లోతుగా చిత్రీకరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో కథానాయికగా కనిపిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో హీరో రోల్ లో కనిపించనున్నారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీ రోల్ ప్లే చేయనున్నారు. ‘మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి’తో డెబ్యూ చేసిన దర్శకుడు మహేష్ బాబు పి. ఈ సినిమాలో తన మార్క్ చేస్తున్నారు. మ్యూజిక్ వివేక్-మెర్విన్ డ్యూయో అందిస్తున్నారు. ఇది ఆయన తొలి తెలుగు ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ పొందాయి.
Read also-Mowgli release date fix: మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘మోగ్లీ’టీం.. వచ్చేది ఎప్పుడంటే?
టీజర్ ను చూస్తుంటే.. చిన్న నాటి నుంచీ సినిమాల ప్రభావంతో పెరిగిన ఓ పిల్లాడు పెద్దయ్యాకా ఆంధ్రా కింగ్ ఉపేంద్ర ఫ్యాన్ అవుతాడు. సినిమాల ప్రభావంతో కాలేజీలో కూడా హీరోలాగే ప్రవర్తిస్తాడు. అదే సమయంలో హీరో ఇన్ తో ప్రేమలో పడతాడు. 90ల కాలంలో సినిమా హీరోల కోసం అభిమానులు ఏ విధంగా రక్తం చిందించే వారో ఈ టీజర్ లో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. అప్పటి ప్యాన్స్ ఎమోషన్స్ ఎలా ఎలా ఉండేవో ఒక్క టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లో ప్రతి డైలాగ్ సినిమా హీరోల అభిమానులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
Read also-Chiranjeevi meets Sajjanar: పీసీ సజ్జనార్‌ను కలిసిన మెగాస్టార్.. ఎందుకంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎప్పటిలాగే తన ఎనర్జీని ఈ సినిమాలో కూడా చూపించారు. ప్రతి సీన్ లోనూ 90ల నాట్ ఫ్యాన్స్ ఎలా ఉండేవారో అచ్చం అలాగే తన ఎమోషన్స్ ను పండించాడు రామ్ పోతినేని. హీరోయిన భాగ్యశ్రీ పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయింది. తన క్యూట్ హావభావాలతో మరో సారి ప్రేక్షకులను మెప్పించింది. వీరిద్దరి మధ్య కాలేజీ లవ్ స్టోరీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రతి డైలాగ్ ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఉంది. టీజర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
