Mowgli release date fix: యాంకర్ సుమ కొడుకు, రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతున్న ‘మోగ్లీ’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మూవీ టీం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనిని చూసిన ప్రేక్షకులు ప్రమోషన్ స్కిట్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్ కనకాల రెండో సినిమా ‘మోగ్లీ 2025’కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ అడ్వెంచర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదలవుతుందని చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో రోషన్ కనకాల ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అతని ప్రేమను రక్షించుకోవడానికి ఎంతదూరమైనా వెళ్లే యువకుడి పాత్రలో శక్తివంతంగా కనిపించనున్నాడు. హీరోయిన్‌గా సాక్షి నటిస్తుండగా, హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ సినిమాకు మేజర్ హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
Read also-K Ramp controversy: హీరోలను రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు కరెక్టేనా?.. లేదా ప్రమోషన్‌లో భాగమా!..
విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ కనిపించనున్నాడు, అతని విలనిజం కూడా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా, హీరో నాని వాయిస్‌ఓవర్‌తో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుత స్పందన వచ్చింది. రోషన్ కనకాల మొదటి సినిమా ‘బబుల్ గమ్’ తర్వాత ఈ ‘మోగ్లీ’తో మరోసారి ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు మరిన్ని ప్రమోషనల్ మెటీరియల్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం సూచించింది. దీని గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Sai Dharam Tej: అప్పుడు కోమాలోకి వెళ్లాను అని చెప్పలేదు.. చిల్ అవ్వడానికి వెళ్లా అని చెప్పేవాడిని..
ప్రస్తుతం సినిమా తీయడం గొప్పకాదు దానిని ఎలా ప్రమోట్ చేశారు అన్నది పెద్ద టాస్క గా మారింది దర్శకులకు. దీనికి ఆజ్యం పోసింది అనిల్ రావిపూడి. ఆయన తీసిన సినిమాలు ప్రమోషన్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం ఈ ట్రెండ్ ను తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఫాలో అవుతోంది. తాజాగా ‘మోగ్లీ’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పటికే షూటింగ్ పరంగా సినిమా బాగా లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. దానిని త్వరగా పూర్తి చేసి సినిమా వీలైనంత తొందరలో విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో విడుదల తేదీలు గురించి దర్శకుడు సందీప్ రాజ్, వైవా హర్ష, హీరో రోషన్ కనకాల మధ్య చర్చలు జరుగుతాయి. దాంట్లో ఏ తేదీ సరిగ్గా సరిపోతుందో చూసి డిసెంబర్ 12, 2025న ఈ సినిమా విడుదల చేద్దాం అని దర్శకుడు సందీప్ రాజ్ కన్ఫామ్ చేస్తాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారని తెలుస్తోంది. కాలభైరవ్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో మెట్టు ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమా విడుదల కోసం సందీప్ రాజ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
A small candid discussion with my REBEL boys 😉#Mowgli on Dec 12th pic.twitter.com/YcuS66gj5E
— Sandeep Raj (@SandeepRaaaj) October 11, 2025
