Ram Pothineni : తెలుగులో టాలెంటెడ్ యంగ్ హీరోస్‌లో మిల్కీ అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ మూవీతో రామ్ పోతినేని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకువెళ్తున్నాడు. ఆ తర్వాత వరుసగా ప్లాప్స్ వెంటాడినప్పటికీ.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇష్మార్ట్ శంకర్’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇష్మార్ట్ శంకర్-2, స్కంద సినిమాలు హట్టర్ ప్లాఫ్ మూటగట్టుకున్నాయి. ఇప్పుడు మరో మూవీతో రామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ డైరెక్టర్ మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
రామ్ కెరీర్‌లో ఇది 22వ చిత్రం. #RAPO22 అని వర్కింగ్ టైటిల్ ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. రామ్‌కి జంటగా ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు. ఇందులో సాగర్ పాత్రలో రామ్ నటిస్తుండగా.. మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే అలరించనుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందతున్న ఈ చిత్రానికి టైటిల్ ఏమి పెడతారనేది ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ ద్వయం వివేక్ మర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సైతం పాటలు రాశారు. అయితే ఈ సినిమాతో రామ్ రైటర్‌గా మారబోతున్నాడు. ఈ మూవీ కోసం ఒక లవ్ సాంగ్ రాస్తున్నాడు. అయితే ఈ సాంగ్ ఎలా ఉండిపోతుందనే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రామ్ రాసిన ఆ లిరిక్స్, సాంగ్ ఎలా ఉంటుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
Also Read: ప్రభాస్ నన్ను చీట్ చేశాడు: హీరోయిన్
ఇప్పటివరకు డ్యాన్స్‌తో ఇరగదీసిన రామ్.. ఇక పాటలు రాస్తూ ప్రేక్షుకులను అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది. హీరో, హీరోయిన్‌కి సంబంధించిన పలు సీన్స్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రామ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇటీవల మాస్ సినిమాలతో అలరించిన రామ్.. ఒక్కసారిగా లవర్ బాయ్ లుక్‌లో కనిపించాడు. డీసెంట్ షర్ట్స్‌తో కళ్ల జోడు పెట్టుకున్న ఓ ఫోటో సోషల్ మీడియా వైరల్ అయ్యింది. అయితే రూట్ మార్చిన రామ్‌కి ఇది వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Beta feature