Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni).. ఎప్పుడూ లేనిది ఓ సినిమా విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా ఏదో కాదు.. ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King Taluka). పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి (Mahesh Babu P) దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను ఇందులో పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై.. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మంగళవారం థాంక్ యూ మీట్ (Andhra King Taluka Thank You Meet)ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్స్ మాత్రం రావట్లేదనే విషయాన్ని తెలియజేస్తోంది.
పర్సనల్ కనెక్షన్
ఈ కార్యక్రమంలో రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘‘ముందుగా రివ్యూవర్స్ అందరికీ థాంక్స్. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాకు చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సినిమా అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది బ్యూటిఫుల్ సినిమా. ఎక్కువ మంది జనాలు చూడాలనే మైండ్ సెట్‌తోనే తీశాం. కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్‌లో విడుదల చేయాల్సి వచ్చింది. కానీ, ఎప్పుడు రిలీజ్ చేసినా, కంటెంట్ మీద, మాకు ఆడియన్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడు చేయనంతగా ఈ సినిమాను ప్రమోట్ చేశాం. ఎందుకంటే నాకు అంత పర్సనల్ కనెక్షన్ ఈ సినిమాతో ఉంది. ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ చూశాం. కానీ స్టార్ అండ్ ఫ్యాన్‌కు మధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ కూడా టచ్ చేసిన చిత్రమిది. ఇలాంటి ఎమోషన్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. మన తెలుగు సినిమాకే సొంతం.
Also Read- The Raja Saab: ‘రాజా సాబ్’కు ముందు ‘ది’ ఎందుకు? మహేష్‌లా ప్రభాస్‌కు కూడా సెంటిమెంట్!
టిఎఫ్ఐ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు
నేను ఏ సినిమా చేస్తున్నా హిట్టా ఫ్లాపా అనేది తలచుకుంటే భయమేస్తుంది. కానీ, ఈ సినిమా చేసినప్పుడు మాత్రం ఇది మంచి సినిమా అని, ప్రేక్షకులు వెంటనే తెలుసుకుంటారా? లేక కొంచెం లేటుగా తెలుసుకుంటారా అనేది చూడాలని అనిపించింది. ఎందుకంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా.. మొదటి రోజే కలెక్షన్స్ మొత్తం రాబట్టాలనే ప్లానింగ్‌లో లేము. ఫస్ట్ వీక్ స్లోగా ఉంటుంది, నెమ్మది నెమ్మదిగా పికప్ అవుతుందని మొదటి నుంచి నమ్ముతూ వచ్చాం. ఈ సినిమాను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రేక్షకుల నుంచి కూడా స్పందన వస్తుంది. అదే సమయంలో టిఎఫ్ఐ ఫెయిల్ అయ్యిందనే మాట కూడా అక్కడక్కడా వినిపిస్తుంది. కానీ నేను నమ్మేది ఏమిటంటే.. టిఎఫ్ఐ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. మనమంతా సినిమా లవర్స్. మంచి సినిమాకి కాస్త ఆలస్యం కావచ్చు కానీ, కచ్చితంగా గుర్తింపు వస్తూనే ఉంటుంది. ఈ సినిమా పదిమంది చూస్తే 9 మందికి నచ్చింది. అన్ సీజన్ వల్ల ఆ పదిమంది చూశారు. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాను.
Also Read- Ravi Teja: రవితేజ – శివ నిర్వాణ కాంబో ఫిల్మ్‌లో ఆరుగురు హీరోయిన్లు వార్తలపై టీమ్ ఏం చెప్పారంటే?
ఎక్కువ మంది ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం
100 మంది చూస్తే కచ్చితంగా 90 మందికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. నవంబర్ అయిపోయింది. ఎక్కువ మందికి ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. మరింత మంది థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఒక హానెస్ట్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో అండర్ కరెంట్‌గా అద్భుతమైన మెసేజ్ కూడా ఉంది. సినిమా చూసి మంచి స్ఫూర్తితో బయటికి వచ్చే కంటెంట్ ఉంది. పదిమందిలో తొమ్మిది మంది అది ఫీలయ్యారు. సెకండ్ వీక్ ఈ సినిమా అద్భుతంగా రన్ అవుతుందని నమ్ముతున్నాం. ఇంకా ఎక్కువ మంది సినిమా చూసి ఒక మంచి అనుభూతిని పొందుతారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా లవర్స్ అందరూ.. ఈ సినిమాకి వచ్చి, ఈ ఎమోషన్‌ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
