peddi song (Image:X)
ఎంటర్‌టైన్మెంట్

Chikiri song out: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది..

Chikiri song out: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ పాట విడుదలైంది. ఈ పాట ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచింది. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. బాలాజీ తెలుగు సాహిత్యాన్ని అందించగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట ప్రోమోలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన డాన్స్ మూమెంట్స్ చూసి అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్ చిరంజీవి మాస్ స్టెప్పులను గుర్తుచేసుకున్నారు.

Read also-The Girlfriend review: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ జెన్యూన్ రివ్యూ.. రష్మిక ఏం మాయ చేసిందో తెలియాలంటే..

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఆధారంగా రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా, ఒక ఉత్సాహవంతమైన గ్రామస్తుడు తన సమాజాన్ని క్రీడల ద్వారా ఏకం చేసి, శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే కథను చిత్రిస్తుంది. బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం మార్చి 27, 2026న పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Read also-Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

పెద్ది సాంగ్ చూస్తుంటే.. ఓ చికిరి చికిరి చికిరి అంటూ మొదలవుతుంది సాంగ్. ఏఆర్ రెహమాన్ మరోసారి ఈ పాటతో మాయ చేశాడు. అందరూ ఊహించినట్లుగానే ఈ సాంగ్ రామ్ చరణ్ హిట్ ప్లే లిస్ట్ లో చేరిపోతుంది. ప్రతి విషయంలోనూ దర్శకుడు బాగా కేర్ తీసుకున్నారు. 2025 లో ఈ సాంగ్ చాట్ బాస్టర్ గా నిలిచిపోతుంది. దీనిని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బుచ్చి రామ్ చరణ్ కి మరో హిట్ సాంగ్ తీసుకొచ్చాడని చెప్పుకుంటున్నారు. జాన్వికపూర్ వెనుక చరణ్ స్టెప్పులేస్తుంటే.. మెగాస్టార్ బంగారు కోడిపెట్ట పాటను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

Just In

01

Jubilee Hills By Election: ఇక మిగిలింది మూడు రోజులే.. ప్రధాన పార్టీల అభ్యర్థుల వెనుక షాడో టీమ్స్..!

SC on Stray dogs: సుప్రీంకోర్టు మరో సంచలనం.. వీధి కుక్కలపై కీలక ఆదేశాలు జారీ

Bigg Boss Telugu 9: కెప్టెన్సీ రగడ.. హౌస్‌లోకి రైలు బండి.. సాయి, దివ్యల మధ్య బిగ్ ఫైట్!

The Great Pre-Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో తిరువీర్ చేసిన పనులు నవ్వించాయా.. తెలియాలంటే..

TG Transport Department: బీ కేర్‌ఫుల్.. ఈ నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్..!