Ram Charan: తారక్‌తో స్నేహంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ram Charan seated inside a car with a fellow actor while reacting to a driving moment, sharing a lighthearted and candid interaction.
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Charan: తారక్‌తో స్నేహంపై మరోసారి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ (Man Of Masses NTR)ల మధ్య ఉన్న బాండింగ్ ఏంటో అందరికీ తెలిసింది. ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో వారిద్దరి స్నేహం గురించి కథకథలుగా అంతా మాట్లాడుకున్నారు. ఆ సినిమా తర్వాత ఒకరి సినిమాలకు ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. మళ్లీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే సందర్భం రాలేదు. తాజాగా రామ్ చరణ్ మరోసారి ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్న ఓ బ్రాండ్‌ నిమిత్తం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై వస్తున్న రూమర్స్‌కు బ్రేక్ వేశారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో ఎవరు డ్రైవింగ్‌ చేస్తుంటే.. ఆ రైడ్‌ను ఆస్వాదిస్తారనే ప్రశ్నకు కూడా ఆయన ఆసక్తికరంగా బదులిచ్చారు.

Also Read- VV Vinayak: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చూసిన మాస్ డైరెక్టర్ స్పందనిదే..

‘పెద్ది’ రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్.

ముందుగా ‘పెద్ది’ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుందని, ఇప్పటి వరకు చేయని ఒక అద్భుతమైన పాత్రను ఇందులో చేస్తున్నట్లుగా, తనకు ఎంతో ఇష్టమైన పాత్రగా ‘పెద్ది’ పాత్ర గురించి రామ్ చరణ్ తెలిపారు. ఈ మూవీ వాయిదా పడుతుందనే వార్తలను ఖండిస్తూ.. మార్చి 27న ‘పెద్ది’ (Peddi Movie) విడుదలవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. ‘పెద్ది’ సినిమాపై మొదటి నుంచి ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పెద్ది’ ఫస్ట్ షాట్ నుంచి, రీసెంట్‌గా వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ (Chikiri Chikiri Song) వరకు ప్రతీది బీభత్సంగా ప్రేక్షకులలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ‘చికిరి’ సాంగ్ అయితే రికార్డులు క్రియేట్ చేస్తూ.. సోషల్ మీడియాను ఇంకా షేక్ చేస్తూనే ఉంది.

Also Read- Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని ఉంది..

తారక్ డ్రైవింగ్‌లో..

డ్రైవింగ్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో తారక్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చుని రైడ్‌ని ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ క్రేజీ అండ్ మ్యాడ్ డ్రైవర్ అని కితాబిచ్చారు. తారక్ కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చున్న స్నేహితులకు ఎదురైన అనుభవాలన్నీ తనతో పంచుకున్నట్లుగా ఆయన తెలిపారు. కాబట్టి, తారక్‌ డ్రైవ్ చేస్తుంటే, ఆ రైడ్‌ని ఎంజాయ్ చేస్తానని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా చరణ్ మాట్లాడుతూ.. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోనని, మరీ ముఖ్యంగా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ని మనసుకు తీసుకుని బాధపడనని చరణ్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్‌కు ‘పెద్ది’ సినిమా ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

AR Rahman: ‘ఛావా’, బాలీవుడ్‌ ఛాన్సెస్‌పై ఏఆర్ రెహమాన్ వివాదస్పద వ్యాఖ్యలు

District Reorganisation: కొత్త పేర్లతో జిల్లాలు?.. బయట వినిపిస్తున్న టాక్ ఇదే!

Peddi Update: బీస్ట్ మోడ్ స్టిల్స్‌తో ఇంటర్నెట్ షేక్! ‘పెద్ది’ తాజా అప్డేట్ ఇదే..

Indigo Airlines: డిసెంబర్‌ గందరగోళం ఎఫెక్ట్.. ఇండిగోకి భారీ జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం

Ram Charan: తారక్‌తో స్నేహంపై మరోసారి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు