Raju Weds Rambai review: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫుల్ రివ్యూ..
raju-weds-rambai(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Raju Weds Rambai review: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రేమకథ ప్రేక్షకులను మెప్పించిందా?.. ఫుల్ రివ్యూ..

మూవీ: రాజు వెడ్స్ రాంబాయి

రిలీజ్ డేట్: నవంబర్ 21, 2025

దర్శకుడు: సాయిలు కంపాటి

నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి (ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్)

కాస్ట్: అఖిల్ రాజ్ (రాజు), తేజస్వి రావు (రాంబాయి), చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనితా చౌదరి మొదలైనవారు

సంగీతం: సురేష్ బొబ్బిలి.

నేపథ్యం

Raju Weds Rambai review: తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, ఖమ్మం-వరంగల్ సరిహద్దులోని ఓ గ్రామంలో 2004-2010 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. వాస్తవ ఘటనల నేపధ్యంలో జరిగిన కథను చిత్రీకరించామని దర్శకుడు అనేక సార్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని ప్రదర్శిస్తూ దర్శకుడు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ సెంటర్ లో అర్ధ నగ్నంగా కూడా తిరుగుతా అన్నారు. దర్శకుడు ఇంత నమ్మకంతో చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సురేశ్ బొబ్బిలి సంగీత సారధ్యంలో వచ్చిన రాంబాయి సాంగ్ చాట్ బాస్టర్ అయింది. దీంతో ఈ సినిమా మరింత లోతుగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఇంతటి హైప్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే..

Read also-Bhagyashri Borse: ‘అరుంధతి’ తరహా పాత్ర చేయాలని ఉంది.. ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో?

కథ

తన ఊరిలో డప్పు మేస్త్రీగా పనిచేసే రాజు, ప్రభుత్వ ఉద్యోగి కావాలని పట్టుదలతో ఉండే కాంపౌండర్ కూతురు రాంబాయిని ప్రేమిస్తాడు. వెంకన్న (రాంబాయి తండ్రి) తన కూతురు ప్రేమను ఒప్పుకోడు. దీంతో వారిద్దరూ తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, వారి ప్రేమ కథ చివరికి ఏమైంది అనేదే ఈ చిత్రం. సినిమా మొదట్లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా, సరదా సన్నివేశాలతో సాగుతుంది. రాజు-రాంబాయి ప్రేమ సన్నివేశాలు, స్నేహితులతో కామెడీ ఆకట్టుకుంటాయి. తెలంగాణ యాసలో రాసుకున్న సంభాషణలు చాలా సహజంగా, అలరించే విధంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించినా, సినిమా మొత్తానికి ప్రధాన బలం క్లైమాక్స్. ఇది ‘పరువు’ కోసం చేసే హింసను మరో కోణంలో చూపిస్తుంది. దర్శకుడు సాయిలు కంపాటి ఒక సున్నితమైన అంశాన్ని ఎమోషనల్‌గా, నిజాయితీగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

నటీనటుల ప్రదర్శన

హీరో పాత్రలో అఖిల్ రాజ్ (రాజు) డప్పు మేస్త్రీ రాజు పాత్రలో సహజంగా నటించాడు. ఒక ప్రేమికుడి ఎమోషన్స్‌ను చక్కగా పలికించాడు. హీరోయిన్ గా తేజస్వి రావు రాంబాయి పాత్రలో ఒదిగిపోయింది. అఖిల్-తేజస్వి జోడీ చూడముచ్చటగా ఉంది. చైతు జొన్నలగడ్డ (వెంకన్న) రాంబాయి తండ్రి పాత్రలో మొండి పట్టుదల గల కాంపౌండర్ పాత్రలో చైతన్య ప్రదర్శన హైలెట్‌గా నిలిచి, విలనిజాన్ని కొత్త కోణంలో చూపించాడు. శివాజీ రాజా, అనితా చౌదరి తదితరులు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు.

Read also-Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’ ఫిబ్రవరిలో కాదు.. ఎప్పుడంటే? ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

సాంకేతిక అంశాలు

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాయిలు కంపాటి వాస్తవ సంఘటనను తీసుకుని, దానిని హృదయానికి హత్తుకునే ప్రేమకథగా మలచడంలో దర్శకుడు విజయం సాధించారు. కొత్త నటీనటుల నుండి మంచి నటనను రాబట్టాడు. దర్శకుడిగా సాయిలుకు ఈ సినిమాకు వంద మార్కులు ఇవ్వవచ్చు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి, కథకు బలాన్నిచ్చాయి. సినిమాటోగ్రఫీ గా వాజిద్ బేగ్ పల్లెటూరి వాతావరణాన్ని, పొలాలను, గ్రామీణ దృశ్యాలను చాలా సహజత్వంగా చూపించారు. ఇది సినిమాకు మరింత బలాన్నిచ్చింది. నిర్మాతలుగా వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి కథకు కావాల్సిన విధంగా నాణ్యమైన నిర్మాణ విలువలు అందించారు.

ప్లస్ పాయింట్స్

  • వాస్తవ కథ
  • నటీనటుల సహజ నటన
  • క్లైమాక్స్
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్

  • నెమ్మదిగా సాగే కథనం
  • సెకండ్ హాఫ్‌ స్లోగా ఉండటం.

ముగింపు: ‘రాజు వెడ్స్ రాంబాయి’ పరువు హత్యల నేపథ్యాన్ని కొత్త కోణంలో చూపించే మంచి ఎమోషనల్ స్టోరీ.

రేటింగ్ : 2.75 / 5

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..