Coolie Trailer: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ యాక్షన్ థ్రిల్లర్, సన్ పిక్చర్స్ నిర్మాణంలో 2025 ఆగస్టు14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ఏం విడుదల చేయకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేస్తుందన్న టాక్ వినపడింది. తాజాగా దానికి తెరదింపారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో ఉంచారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ‘సైలెంట్ గా కాదు థియేటర్లలో వైలెంట్ చెయ్యడానికి వస్తున్నాం’ అంటూ రజనీ కాంత్ అభిమానులు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రం చెన్నైలోని డాక్‌యార్డ్ కూలీల జీవితాలు, కష్టాలు, పోరాటాల చుట్టూ తిరిగే గట్టి కథాంశంతో రూపొందుతోంది. రజనీకాంత్‌ను ఒక పవర్‌ఫుల్ కూలీ నాయకుడిగా కనిపించబోతున్నారు.
Read also- Samantha: ఆ ఛాలెంజ్ లో సమంత గెలిచింది.. ఒక్క దెబ్బతో అలాంటి రూమర్స్ కి చెక్ పెట్టేసిందిగా!
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 2, 2025న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీని గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్‌ను ఫిలోమిన్ రాజ్ నిర్వహిస్తుండగా, ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ 2016లో ‘అవియల్’ అనే ఆంథాలజీ చిత్రంలో భాగంగా తన కెరీర్‌ను ప్రారంభించి, 2017లో ‘మానగరం’తో దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్నాడు, ఆ తర్వాత ‘ఖైదీ’ (2019), ‘మాస్టర్’ (2021), ‘విక్రమ్’ (2022), ‘లియో’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దక్షిణ భారతదేశంలో అగ్ర దర్శకులలో ఒకరిగా స్థానం పొందారు.
Read also- Kingdom: రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కింగ్డమ్’ సాంగ్..
యాక్షన్ త్రిల్లర్ గా రాబోతున్న ‘కూలీ’ సినిమా యునైటెడ్ స్టేట్స్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటికే 20,000కి పైగా టికెట్లు అమ్ముడై సుమారు 4.67 కోట్ల రూపాయలు అర్జించింది. 365 లొకేషన్లలో 815 షోలతో సంచలనం సృష్టిస్తోంది. ఈ గణాంకాలు ప్రీమియర్‌లకు 16 రోజుల ముందు నమోదయ్యాయి. ఇది రజనీకాంత్ స్టార్‌డమ్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పట్ల అభిమానులకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం బిజినెస్ 80 కోట్ల రూపాయలకు పైగా రికార్డు ధరకు లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇది తమిళ సినిమా చరిత్రలోనే అత్యధికం. అంతేకాక ఈ చిత్రం ‘పవర్‌హౌస్’ లిరిక్ వీడియో Xలో 5 మిలియన్ రియల్-టైమ్ వీక్షణలను దాటింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.