Varanasi: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ సినిమాలైన ‘RRR’, ‘బాహుబలి’ చిత్రాలను అందించిన విజనరీ ఫిల్మ్ మేకర్ ఎస్ఎస్ రాజమౌళి, ఇప్పుడు తన తదుపరి భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘అధికారిక సారాంశం’ తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ ఈ వెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మూవీ టీం.
Read also-Divya Bharathi: ‘గోట్’ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్.. సుడిగాలి సుధీర్ ఏం చేశాడంటే?
కథాంశం
ఇప్పటికే రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెబుతున్న ఈ చిత్రం, ఒక అద్భుతమైన టైమ్-ట్రావెల్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఈ సారాంశం సూచిస్తుంది. “భారతదేశంలోని వారణాసి నగరాన్ని ఒక ఉల్క (Asteroid) తాకినప్పుడు, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ప్రపంచం అంతరించిపోయే ప్రమాదంలో ఉందా? భూమి చరిత్రలో అత్యంత కీలకమైన క్షణాలను ప్రభావితం చేయడానికి ఖండాలు కాలాల గుండా ప్రయాణించాల్సిన ఒక రక్షకుడు అవసరమా?” రక్షకుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అన్నదే కథాంశం. తాజాగా దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే దీనికి సంబంధించి మూవీ టీం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇదే అంశం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. గత కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పాశాను అలా అన్ని సినిమాలకు చెప్పాల్సిన అవసరం ఉండదు. అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ కథాంశం సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేదిగా ఉంది. దీనిని చూసిన మహేష్ బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?
మహేష్ బాబు డ్యూయల్ రోల్?
ఈ సంక్షిప్త కథాంశం ప్రకారం ‘వారణాసి’ చిత్రం పౌరాణిక అంశాలు, యాక్షన్ అడ్వెంచర్‌లతో కూడిన పూర్తిస్థాయి టైమ్ ట్రావెల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులను ఖండాలు దాటించి, వీరులు, రాజులు దేవతల యుగాల మీదుగా తీసుకువెళుతుంది. పాత్రల వివరాలపై ఇంకా గోప్యత కొనసాగుతున్నప్పటికీ, పరిశ్రమ వర్గాల ఊహాగానాల ప్రకారం.. మహేష్ బాబు కేంద్ర “రక్షకుడి” పాత్రను పోషించవచ్చని, అతను వివిధ కాలాలలో ప్రయాణిస్తాడని తెలుస్తోంది. అంతేకాకుండా, మహేష్ బాబు ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రను కూడా పోషించే అవకాశం ఉందని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘వారణాసి’ చిత్రం టైటిల్ గ్లింప్స్ ను ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఆ క్లిప్, రాజమౌళి తనదైన శైలిలో ప్రేక్షకులను చారిత్రక, పౌరాణిక అద్భుత లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసేలా ఉంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మరిన్ని వివరాలు తెలియాలంటే వేచి ఉండాల్సిందే.
