Tortoise: యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) మళ్లీ బిజీ నటుడిగా మారుతున్నారు. ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చిన ‘చిరంజీవ’ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటున్న విషయం తెలిసిందే. అందులో ప్రయోగాత్మక పాత్రలో అలరించిన రాజ్ తరుణ్, మరోసారి అదే తరహా పాత్రలో కనిపించబోతున్నారు. ‘పగలు, రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తితో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు.. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే’’ అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోబోతున్న చిత్రం ‘టార్టాయిస్’ (Tortoise). ఈ చిత్రాన్ని సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.
నా కెరీర్‌కి మంచి కిక్కిచ్చే సినిమా
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా ప్రారంభోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీత బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘టార్టాయిస్’ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ. దర్శకుడు రిత్విక్ కుమార్ (Rithvik Kumar) ఈ కథను చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి కథతో వస్తున్న మా నిర్మాతలకు కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరీర్‌కి మంచి కిక్ ఇస్తుందని నమ్ముతున్నానని అన్నారు.
Also Read- Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..
డిఫరెంట్ కథతో వస్తున్న థ్రిల్లర్
దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా పూజ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి పాత్రలు చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్‌ప్లేతో డిఫరెంట్ కథతో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఈరోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా, చాలా మంచి స్పందన వస్తోంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. నిర్మాతలు మాట్లాడుతూ.. కథ చాలా బాగా నచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. మా దర్శకుడు రిత్విక్ కుమార్‌పై పూర్తి నమ్మకం ఉంచాం. రాజ్ తరుణ్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
